Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

134

తెలుగు భాషా చరిత్ర

నకు -ఇయించు కూడా వస్తుంది. సరియించు (SII 5.1138, 9,1140) మొ.వి. వీటి పోలికవలన ఉదయించు రూపానికి ఉదియించు. (పై. 4.1061.2,1149) వంటిరూపాలు తరచుగా కనిపిస్తాయి. -ఇంచు ప్రత్యయం అకర్మక రూపాన్ని సకర్మకం చేయనూ, సకర్మకాన్ని ప్రేరణరూపంచేయనూ కూడా వస్తుంది. చెల్లించు (పై. 10.61.6,1104), చేయించు( పై. 6.1096.4,1383). ఈ ప్రత్యయం ముందు 'చ'కారం 'ప'కారం అవుతుంది. గ్రొచ్చు - గ్రొప్పించు (పై. 10.991.14, 1139) మొ. వి. మెచ్చించు (పై. 10.151, 1161) వంటి రూపాలు అరుదుగా కనిపిస్తాయి.

(అ) బహుధాతుక విభాజ్యాలు (Compounds)

దేశి : చేకొను ( SII 4.1170.11, 1129), పనివడు (పై. 10.89. 14, 1132) మొ. వి.

మిశ్రం : దయసేయ (సం + తె) (పై. 4.737.30.1115), నుతికెక్కు (పై. 4.675.25, 1140) మొ. వి.

ప్రత్యయాలు చేరేటప్పుడు క్రియాప్రాతిపదికల్లో చాలామార్పులు వస్తాయి. ఇట్టివి చాలా ఉండటంచేత సారస్వతభాషలో గాక శాననాల్లో మాత్రం వచ్చేవాటిని కొన్నింటిని ఇక్కడ పేర్కొంటాను.

(క) క్రియాప్రాతిపదిక అంతమందుగల యకారానికీ ద్వితయక్త చకారానికి ఉత్తమ మధ్యమ భూతకాలిక ప్రత్యయం పరమయ్యేటప్పుడు సకారమవుతుంది. చేయు - చేస్తిని ( SII 10.334.66, 1251 ), ఇచ్చు-ఇస్తిమి ( పై. 6,121.37, 1119 ) మొ. వి. అనుస్వారం తర్వాత చకారం ద్విత్వమౌతుంది. కాబట్టి వాటిక్కూడా సకారమౌతుంది. మన్నించు-మన్నింస్తిమి ( పై. 10.499.15.1311). ఇలాంటి చోట్లలో అనుస్వారం లోపించవచ్చు. కటిస్తిమి ( NI 1.7.28, 1244) మొ వి.

(ఖ) ద్విత్వం కాని చకారం క్త్వార్ధక ప్రత్యయమైన-ఇ ముందును విశేషణ ప్రత్యయమైన -ఇన ముందును సకారం కావచ్చు. విలిసి (SII 4.1114.17,1163), విడిసిన ( పై. 4.1122.5, 1189)మొ. వి.