పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

128

తెలుగు భాషా చరిత్ర

   4.47. ఇవిగాక -క్రి౦దన్‌, -మీందన్‌/-మిందన్‌, -పైన్‌, ఒద్దన్‌/-వద్ధన్‌, -కడన్‌ మొ. ప్రత్యయాలు గూడా సప్తమ్యర్థంలో కనిపిస్తాయి. చెఱువు క్రి౦ద (SII 6.1174. 9, 1151 ), ధాత్రిమీంద (పై 6.625.65,1158 ), పల్లియలమింద (పై. 4737.11,1115 ), ఈ ధర్మువుపై (పై. 5. 1343.12,1146), ఉయ్యూరి ఒద్ధ (పై. 4.762.10,1131), తూమువద్ద ( తె.శా. 1.1559,1125), తాడేకుంటకడ (SII 6.225.8,1288) మొ.వి. _పోలెన్‌, _వలెన్‌, _మాడ్కి -వంటి మొదలైన పోలిక ప్రత్యయాలు కనిపిస్తాయి. గురుంపోలెన్‌ ( పై. 10.675.35, 1140), మాఱయ  వలెన్‌ (పై. 10.282.11,1230), అఱిగాంపుల మాడ్కి . (పై. 4.737 21,1115 ), లెంకవంటి కోకన ( పై. 10.337-

68,1251) మొ వి.

4.48. సంఖ్యావాచకాలు :

   ఇవి నామపదాల కిందే రావలసీ ఉన్నా, ఇందుకొన్ని విశేషాలుండటం చేత వీటిని గురించి  ప్రత్యేకంగా వ్రాయవలసి వచ్చింది.
   (1) ఒకటి : ఈ శబ్దాన్ని ఈ యుగంలో ఈ కిందివిధంగా వ్రాసేవారు. ఒక్కొణ్డు ( SII. 4.1305,8, 1107 ), ఒక్కణ్ణు (పై. 5.1091.8.1129), ఒకణు (పై. 5 1848, 12.1146 ), ఒక్కడు (పై. 5.1284.20. 1235), ఒక్కటి. (పై. 4.685.10,1173). ఒకటి (పై. 10,73,115, 1115). ఈ యుగానికి పూర్వపు శాసనాలుచూస్తే ఒక్కొండు వంటి రూపాలే ఎక్కువగా ఉండటంచేత ఈ ఒక్కొండు శబ్దం ఒక్‌ + ఒణ్డు కలయికచేత ఏర్పడిందని చెప్పవచ్చు. ఒక శబ్దం కొన్ని మధ్య ద్రావిడ భాషలలో కనిపిస్తుంది, ఒణ్డుకు ప్రాచీన రూపమైన *ఒన్ఱు చాలా ద్రావిడ భాషలలో కనిపిస్తుంది. అది మొదట ఒక్కొాండు అయి తర్వాత ఒక్కండు అయింది. ఇట్టి మార్పు ఈ యుగానికి ముందే ఎప్పుడో జరిగిపోయింది. కాని ఈ యుగంలో ఒక్కండు శబ్దానికి ఔప విభక్తిక రూపమైన ఒక్కణ్ణి లేక ఒక్కటి ప్రథమారూపంగా వాడడం జరిగింది. ఔపవిభక్తిక రూపాన్ని ప్రథమాంతంగా వాడడం 11 వ శతాబ్దిలోనే ఒక్కచోట కనిపిస్తుంది. 12వ శతాబ్ది నుండి క్రమేణ ఎక్కువగుతూ వస్తుంది.