శాసన భాషా పరిణామం 129
ఇట్టి పరిణామాన్ని నన్నయ భాషలోని ప్రయోగాల్ని ఎఱ్ఱన ప్రయో గాల్ని బట్టి చూచినా స్పష్టమవుతుంది.3
(2) రెండు, మూడు రూపాలకు ఈ యుగంలో చెప్పుకోదగ్గ విశేషా లేమీ లేవు.
(3) నాలుగు : ఈ శబ్దానికి ముఖ్యంగా రెండు రూపాలున్నాయి. (అ) నాలుగు/నాలువు ( ఆ ) నాలు-నాలుగు (SII 6.598. 10,1163), నాలువు (పై. 4.1142.5,1143), నాలు (పై. 6.845. 16,1273) మొ. వి. పై వాటిలో నాలు రూసం విశాఖ - శ్రీకాకుళం ప్రాంతంలోనే కనిపిస్తుంది.
(4) ఐదు : దీనికి రెండు రూపాలున్నాయి. (అ) ఐదు (ఆ) ఏను: ఐదు (SII 6.228.63.1197), ఏను ( పై. 5.1011.7,1108). ఈ రెంటిలో ఏను శబ్దం 12వ శతాబ్దిలో విశేషంగా ఉండి రానురాను ఎక్కువవుతూ. వస్తుంది. అందులోను ఐదు శబ్దం 12వ శతాబ్దిలో తెలంగాణా-గుంటూరు ప్రాంతంలో మాత్రం కనిపిస్తుంది. 13, 14 శతాబ్దులలో ఐదు శబ్దం పూర్తి ఆంద్రదేశానికి వ్యాపిస్తుంది. బవాశా ఐదు శబ్దం కన్నడం నుండి తెనుగుకు వచ్చిన ఎరువుమాట అయి ఉంటుంది.
(5) ఆఱు, ఏడు శబ్దాల్లో విశేషాలేమీ లేవు.
(6) ఎనిమిది : ఎనిమిది (తె. శా. 1.19.42,1195), ఎన్మిది (SII 4.1248.12,1112), ఎనుమిది ( పై. 6.1173.6,1104) మొ. వి. ఎనిమిది శబ్దానికి పూర్వరూపం ఎణ్-పది అని చెప్పవచ్చును. ఇది ప్రాచీనశాసనాల్లో అనేక రూపాలతో ఉంది. ఈ యుగానికి ఎనిమిది రూపం స్థిరపడినట్టు పై ఉదాహరణలవల్ల తెలుస్తుంది.
(9) తొమ్మిది : (SII 5.1166.10,1266). దీనిని తొణ్-పది నుండి వచ్చినట్టు చెప్పవచ్చు. ఈ రూపం కూడా ఈ యుగంలో మార్పేమీ లేకుండా స్థిరపడిందని చెప్పవచ్చు. పై వివరణలవల్ల ఒకటి, ఎనిమిది, తొమ్మిది రూపాలు చారిత్రకంగా రెండు ధాతువుల కలయికవల్ల ఏర్చాడ్డాయని తెలిసింది. అంటే ఇవి సమాసరూపాలన్నమాట.