పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం

127

దీన్ని పోల్చే సందర్భంలో వాడుతారు. నాకాధీశపురంబు కంటె నిదిమేలు ( SII 6,285.4, 1158 ) మొ.వి.

4.45. షష్ఠి విభక్తి : ఉకారాంత పదాలకు అచ్చుపరమైతే షష్ఠిప్రత్యయంగా నకారం వస్తుంది. మూలస్థానంబు నాదిమూర్తికి ( SII 4.672.17, 1139) మొ. వి. లేనిచో ప్రాతిపదికే షష్ఠీరూప మవుతుంది. ప్రోలెబోయు తమ్ముండు (పై. 4.667.13, 1132) మొ.వి.

4.46. సప్తమీవిభక్తి : (క) -న్‌, -అన్‌, -నన్‌, (ఖ) -లోన్‌, -లోనన్‌, _లోపలన్‌ : (గ) -అందు, -నందు, -నయందు ఇవి అధికరణార్థంలో వస్తాయి.

(క) -న్‌, -అన్‌, -నన్‌ : తృతీయావిభక్తిలో చెప్పిన పరిసరాల్లోనే ఇవీ వస్తాయి. కేటిఫల్లిని (SII 10.702.7,1153), పడుమటం (పై. 5.167.14, 1200 ), శ్రీకూర్మమున ( పై. 5.1338,22, 1188).

(ఖ) -లోన్‌, -లోనన్‌, -లోపలన్‌ ; ఉత్తరసీమలో (SII 5.1114.11,1164), చెల్లానలోన ( పై. 4.167.13, 1200 ), సోరకి నాంటి లోపలం ( పై. 10.690.17, 1139 ).

(గ) -అందు, -నందు, -నయ౦దు : చెఱువందు (తె. శా. 1.16.7,1170 ), భోగమునందు ( SII 5.1081.3, 1132 ), ఉత్తరాయణమునయందు (పై. 10.177.90, 1171). పై అందు శబ్దానికి -ఉల ప్రత్యయం చేరి విశేషణం అవుతుంది. అందుల గొల్లమంత(SII 10.208.7, 1200) మొ. వి. అలాగే “ఇందుల కాయ కూర" (పై. 6.904.28. 1291) మొ.వి. ప్రయోగాలు ఉన్నాయి. ఉల ప్రత్యయానికి బదులు -అలి ప్రత్యయం క్వాచిత్కంగా కనిపిస్తుంది. అందలి మాడూరి సోమయ ( తె.శా. 10.36.33, 1215 ) -అల ప్రయోగం ఒక్క శాసనంలో రెండుసార్లు కనిపిస్తుంది. ఇందల శ్రీకంఠమ నాయకు ( SII 10.691.16, 1139 ). ఇందల సోమేళ్వరదేవర (పై. 10. 691.21, 1139).