పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం

113

భువిన్‌ అని చదవాలి. కాముండును(పై. 10.151, 1161) కాముండున్‌ అని చదవాలి.

   4.24. పదాదిస్థానంలో అచ్చులు, (హస్వదీర్ఘాలు వస్తాయి. కాని పదాంతంలో సాధారణంగా ఆ, ఇ, ఉ,లే తరచుగా వస్తాయి. ఎ, ఒలు క్వాచిత్కింగా వస్తాయి. విజయరాజె (SII 5.1070.8, 1138), ఒకకోటి (పై 10. 177.22,1171) మొ.వి.

సంధి:

   4.25.  రెండు పదాల చేరిక వలన రెండు అచ్చులు కలిసినప్పుడు మొదటి అచ్చు లోపించవచ్చు, లోపించక పోవచ్చు ; మధ్యలో యడాగమo రావచ్చు. మన వ్యాకరణ నియమాలేవీ ఈ శాసన ప్రయోగాలకు సరిపడవు.
   (అ) సంధివచ్చే రూపాలు : తమన్న (SII 10.416.128, 1280) (తమ + అన్న); మహిదేవైన (పై, 6.1097.9, 1378) (దేవి + ఐన) మొ. వి.
   (ఆ) సంధి రాని రూపాలు : కొట్టరువు ఎఱియమ (పై. 4.1114.19,1163), దేవనెమ్మెళను ఎవ్వండైన (పై. 6.98 24,1131) మొ.వి.
   (ఇ) యడాగమం వచ్చే రూపాలు : కుంభమాసము యమావాస్య (పై. 5,1343.5, 1146), సత్యెరాజు యిచ్చిన (పై. 4.1098.8, 1152) మొ.వి,
   4.26. ఈశ్వరశబ్ధం పరమయ్యేటప్పుడు గుణసంధికి బదులు తెలుగు సంధి జరగడం ఈ యుగపు శాసనాల్లో తరచుగా చూడవచ్చు.
   (అ) తెలుగు సంధి రూపాలు : భీమేశ్వర( SII 10,177,42 1171), నీలీశ్వర (పై. 10.7128, 1183), మల్లీశ్వర (పై. 6.89.4 1241) మొ. వి.
   (ఆ) గుణసంధి రూపాలు : భీమేశ్వర (పై.10 510.8,1315), నీలేళ్వర (పై. 10.704.8, 1151), మల్లేశ్వర(పై . 6.89.2, 1241) మొ. వి.
   4.27. అచ్చుకు క చ త ప లు పరమైతే  గ స ద వ లు కావచ్చు, కాకపోవచ్చు. వీటిలో దేశి తత్సమాల నియమాలేవీ లేవు.
   (అ) అయిన రూపాలు : రెండు గుంచములు (SII 4.1188.8, 1155), క్రిష్ణసతుర్దసి (పై. 5.1070.4 1138), బోయుండుదన (పై.4.674.6, 1150), పండ్రెండువుట్లు (పై. 5.91.16, 1176) మొ.వి.

(8)