పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

112

తెలుగు భాషా చరిత్ర

ఠక్కురు. (పై. 6.897.6, 1298), ఠావు (పై. 10.111.8,1142), ఢాకిని (భారతి 15.1. 159.86, 1323) మొ.వి. పదమధ్యంలో అటిక (SII 6.1033. 13,396) మొ.వి. ఇతర అచ్చుల ముందూ వస్తాయి.

  డకారం పదాదినికూడా అన్ని అచ్చులముందూ కనిపిస్తుంది. డంగుంబ్రాలు (S1I 4.1243.12. 1112), డాపల ( పై. 10. 1034.7, 1132), డిగ్గు (పై. 6.1201. 7, 1219), డున్నవారు (పై .6.1200.14 1175), డెబ్బదేను (NI 2.28.7, 1258) డేరా (SII 5.1216.6,1314), డోలు (పై. 10.451 115, 1289).
   4.21. సంయుక్త వర్ణాల మధ్యవచ్చే అచ్చు : సంయుక్త వర్ణాల్లో రెండోవర్జం యకారంగా ఉంటే ఇకారమున్నూ, తక్కినచోట్ట ఉకారమున్నూ ఈ యుగపు శాసనాల్లో చాలా తరచుగా వస్తాయి. యకారంముందు : పరియంతము (SII 10 : 340.12, 1253) ( < పర్యంతము ), సంధియ (పై. 5.192.2,1228) (< సంద్య) మొ.వి. తక్కినచోట్ల : పరుషంబు ( పై. 5.1008.1, 1127), కలుహార (పై. 5.672,8, 1139), మహాళబుద (తె. శా. 2: 128.4,1298) మొ. వి.
   4.22. పార్శికాలలో లకారం ఒకటే పదాదిన వస్తుంది. ళకారంరాదు. లక్షణి (SII 6.647.4, 1148 ), లావ (NI3 47.60, 1211 ) మొ.వి. అజ్మధ్యంగా 'బిళసరము, బెళగు'మొ. కొద్ధిచోట్ల ప్ప తక్కినచోట్ల సర్వత్రా ళ కార రూపాలకు లకారరూపాలు. పర్యాయంగా కనిపిస్తాయి. ఉదా : నీళేశ్వర (SII 10. 708.4, 1151). నీలేశ్వర(పై. 10.704 8, 1151), చోడవళనాంటి (పై. 6.156.15 . 1154 ), చోడవళనాణ్జి (పై. 6.135.3, 1144), స్తళము (తె.శా. 1.18.158. 1162): స్తళకరణాలు(SII 10. 528.11, 1319)మొ.వి.
   4.23.  ఈ యుగంనాటి తెలుగుభాష పూర్తిగా అజంతం అయినట్లు తోస్తుంది. పదాంతంలో ఒక్క అనుస్వారం చాలా తరచుగా కనిపిస్తుంది. దత్తం (SII 5.7.6, 1388 ), మాసం(పై. 6.84.2, 1292), రక్తం (NI 1.24 14, 1187) మొ.వి. నకారాంతపదాలు చాలా క్వాచిత్కంగా కనిపిస్తున్నాయి. చంద్రమౌళికిన్‌(SII 10.124 , 1144)మొ. పద్యాల్లో నకారపుపొల్లు రావలసినచోట్ల కూడా 'ను' కాని 'ని' గాని వ్రాసేవారు. భువిని (పై. 10.151, 1161)