Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

114

తెలుగు భాషా చరిత్ర

   (ఆ) కాని రూపాలు : కూంతుఱు కొమ్మసాని (పై. 5.67. 8,113), పెట్టిన చేను(పై. 5.172.13,1194), దొమ్మనతన (పై. 5.1089.8,1131) ఱoటెoగి పొలము(పై. 5.1068.8, 1145) మొ.వి.
   4.28. పదాంతంలో ఒక్క అనుస్వారం తప్ప తక్కిన హల్లులు సాధారణoగా రావు. ద్రుతసంబంధి నకారంకూడా పొల్లుగాగాక 'ను' రూపంలోనే ఉంటుంది(చూ. 4.24 ). కాబట్టి సారస్వతభాషలో ద్రుతప్రకృతికము లనబడే రూపాలు శాసనాల్లో సాధారణమైన అజంతాల లాగానే ప్రవర్తిస్తాయి. ఏకాదశిని ఆదివారమూనూ (NI 2.51.3, 1198), వీని సేకొని (SII 4. 1000.6, 1166), భోజనార్థములకు  వెట్టింపులకుంగా ( పై. 4.1098,8, 1153 ), పుష్పాలకు యిచ్చిన (పై. 18.526.44, 1319) మొ.వి. కొన్ని కొన్ని చోట్ల ద్రుతప్రకృతికాల౦ తర్వాత చ ప లు జ బ లుగా కూడా మారి ఉన్నాయి. క్రిందను బెట్టిన (SII 5.1046.12, 1187), పరలోకానికిం జని తేని (తె. శా. 1.78.2,  1276) మొ.వి.

సంయుక్త వర్ణాలు

   4.29. పదాదిలో : స్పర్శోష్మాలతోను, మూర్దన్యాక్షరాలతోను, పార్శ్వ రేఫాక్షరాలతోను, యకారంతోను, మహాప్రాణాలతోను ప్రారంభమయ్యే సంయుక్తాలు అరుదు. ఘ్రములు (NI 2.84.16) మొ.వి. మహాప్రాణాక్షరాలతో అరుదుగా కనిపిస్తున్నాయి. మిగిలిన హల్లులు రేఖతో సంయుక్తమై తరచుగా కనిపిస్తున్నాయి. క్రొత్త (SII 10.472.25, 1292), గ్రొచ్చు (పై. 10.655.5, 1105), త్రాసు (పై. 10,443.6. 1278), ద్రావిడ (పై .6.719 .23, 1278), ప్రత్తి (పై. 4.935.27,1268), బ్రతుకు (NI 2.727, 1814), న్రిపాలక (పై .10. 89.6. 1132), మ్రొక్కు (పై .4.1302.12, 1106), వ్రయము (పై . 10.340.11, 1253) మొ.వి రేఫగాక తక్కిన హల్లులతో సంయక్తాలు క్వాచిత్కంగా కనిపిస్తాయి. క్షేత్రము (పై . 5.120. 53,1275), ద్వార (పై. 6. 1136.7,1374), వ్యాపారి (పై. 6,1173.5, 1104) మొ.వి. 
   4.30. పదమధ్యంలో : తత్సమ పదాలను మినహాయించి స్థూలంగా ఈ కింది విధంగా చెప్పవచ్చు. దేశివర్ణాలలో ఒక్కరేఫ, హకారం తప్ప అన్ని ద్విత్వంకాగలవు. సంయుక్తాలలో అనునాసికాలు, మూర్థన్యాలు, దంతమూలీయ పార్శ్వం, రేఫ శకటరేఫలు ప్రథమవర్దంగా సాధారణంగా కనిపిస్తాయి. అందు