ఈ పుటను అచ్చుదిద్దలేదు
శాసన భాషా పరిణామం
105
బ్రాహ్మణ, వహ్ని మొదలగు శబ్దాల్ని ప్రాక్సృతభాషలలో ప్రాచీనకాలం లోనే బ్రామ్హణ, వన్హి అని ఉచ్చరించే వారట, ఈయుగంలో కూడా అలాగే ఉచ్చరించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. వన్హి ( S1I 4.675.36, 1140) మొ. వి. నరసింహ శబ్దాన్ని నరసింహ్మ అని విలోమపద్ధతిలో వ్రాసి ఉండటంచేత దీనిని నరసిమ్హ అని ఉచ్చరించినట్లు ఊహించవచ్చు.
4.3. ఱకారం : ఈ యుగంలో ఱ కారం కొన్ని సంజ్ఞావాచకాల్లోనే కనబడుతుంది. అదీ సాధారణంగా విశాఖ-శ్రీకాకుళం ప్రాంతానికే పరిమితం. ఉదా : నిఱు జెఱ్వు ( SII 10.684 3,1133 ) , తాలాంఱ ( పై. 10.674.10, 1131), చోఱగంగ (పై. 10.665.7, 1124 ). పై ఉదాహరణలన్నీ 12 వ శతాబ్దిలొనివే. 13 వ శతాబ్దిలో ఱుత్తిక (పై. 10,262.9, 1218) తప్ప వేరే ప్రయోగాలు లేవు. 14వ శతాబ్దిలో అసలు బొత్తుగా కనబడదు. ఈ ఱకార ప్రయోగం 12వ శతాబ్దిలో విశాఖ-శ్రీకాకుళ ప్రాంతంలోనే కనిపించినా 13వ శతాబ్దిలోని ఱుత్తిక శబ్దం పశ్చిమ గోదావరిలోని తణుకు తాలూకాలో కనిపిస్తుంది. పై శతాబ్దాలకు నిడుం జెఱువు. తాలాండ, డుత్తిక అనే రూపాలు తరచుగా కనిపిస్తాయి. పై శబ్డాలన్నీ సంఙ్ఞావాచకాలే కాబట్టే ఇవన్నీ కేవలం వ్రాతలోనే నిల్చిఉన్నాయనీ అవి ఉచ్చారణలో లేవనీ చెప్పవచ్చు. అదీగాక సఱపంగలవాండు (SII 5.1083.1, 1108), విహారవాఱ (పై. 10.690. 8, 1139)మొ రూపాల్లో డకారానికి బదులు ఱకారం వ్రాతలో ఉంది. కాబట్టి పై ప్రా౦తంలో ప్రాచీన లేఖనా పద్ధతి నిల్చి ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఱకారాన్ని వర్ణంగా తీసుకోనక్కరలేదు.
4.4. ఛకారం : ఛకారం శాసనాల్లో కనిపిస్తుంది. కాని దాన్ని వర్ణంగా తీసుకోనక్కరలేదు. ఎందుకంటే చకారం ద్విత్వమయ్యే టప్పుడూ, అనుస్వారం తర్వాత వచ్చేటప్పుడూ సాధారణంగా ఛకారంగా వ్రాయబడి ఉంది. ఉదా. ఇచ్చిరి/ఇచ్చిరి, సమర్పించిరి/సమర్పింఛిరి. ఇట్టి ప్రయోగాలు సాధారణంగా. విశాఖ-శ్రీకాకుళం ప్రాంతంలోనే కనిపిస్తున్నాయి. ఇట్లు ఈ ప్రాంతంలో రెండు రూపాలు పర్యాయంగా కనబడ్డంచేత ఛకారాన్ని చకారానికి రూపాంతరం అనవచ్చు. కాని దాన్ని వర్ణంగా చెప్పనక్కరలేదు.
4.5. [చ,చ]లు : చవర్జం నేడు తాలవ్యాచ్చుల ముందు తాలవ్యంగాను