Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

104

తెలుగు భాషా చరిత్ర

అచ్చులు :

ముందు వెనక

సంవృత ఇ ఉ ఆర్దసంవృత ఎ ఒ వివృత అ

అచ్చులలో దీర్ఘతకూడా ఒకవర్ణమే అవుతుంది, ఱ కారము సందిగ్ధవర్ణంగా కనబడు తుంది. జ, ఇ ధ్వనులు మవర్ణానికి సవర్ణాలుగా పరిగణించ వచ్చు.

    4.2. అనుస్వారం : వర్గపంచమాక్షరాలకుబదులు అనుస్వారం వ్రాయడం దాదాపు ఈయుగంలో పూర్తయిందనవచ్చు. కాని ఒక్క టవర్గ ముందు మాత్రం వర్గానుసికం చాల తరచుగా కనిపిస్తుంది. వర్గపంచమాక్షరాలకు ముందున్న అనుస్వారానికి వర్గానునాసికాల ఉచ్చారణే ఉంటుంది. గనక ఈస్థానాల్లో అనుస్వారం ఒక ప్రత్యేకమైన వర్ణం అని చెప్పలేము. ఉదా : పంచాదసి (SII4.996 2,1155) దీన్ని పజ్బాదసి అనియే చదువుతాము కనక ఇందలి ఆనుస్వారానికి ఇకారోచ్చారణే ఉంటుంది. మణ్డలేళ్వర (SII 4.996.6,1155) మొదలగుచోట్ల అను స్వారంగాక ణ కారమే తరచుగా వ్రాయబడి ఉంది. సంస్కృతంనుండి వచ్చిన ఎరువు మాటల్లో వకార, హకారాల ముందు ఈ అనుస్వారం ఉచ్చారణ ఎట్టిదో తెలిసికోడం చాలా కష్టంగా ఉన్నవి. ఈ పరిసరాల్లో అనుస్వారం ఉన్న పదాలు వివిధరీతులుగా వ్రాయబడి ఉన్నవి. సంగ్వత్సరంబు (SII 10.707.6, 1153), సమంత్సరంబు (పై. 6. 137,8, 1147), సహ్వస్యర (పై. 6.145.1, 1292). సంహృత్సరంబు. (పై. 5.1212 2,1210), సంమ్వత్సరంబు. (పై. 5.1214.11,1309) - సంవత్సరం, సింహ్య (పై. 6.728.25, 1270), సింహ్వ (పై. 5.1166.4, 1276), సింఘ (పై. 10.63,6, 1106), సిహ్య (పై. 6.775 4, 1364) -సింహం, మొ. వి. బహుశా శిష్టభాషలో ఈ పరిసరాల్లో అనుస్వారానికీ సంస్కృత అనుస్వారోచ్చారణ ఉండేదేమో! ఆ ఉచ్చరణ సామాన్యులకు కొత్తగా ఉండడంవల్ల పై శబ్డాలకు అనేక లేఖన పద్ధతులు ఏర్పడి  ఉండవచ్చు, కాబట్టి పై  పరిసరాల్లోని అనుస్వారోచ్చారణ శాసనకర్త వ్యవహారంలో ఎలాగుండేదో చెప్పలేము. కాని ఈ పరిసరాల్లో మకారోచ్చారణ ఉండేదేమో ! అని సందేహపడవచ్చు, నరసిహ్మ (SII 4 1090.7, 1142), బ్రాంహ్మణ (NI  1.25.17, 1274).