పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

106

తెలుగు భాషా చరిత్ర

తక్కిన అచ్చులముందు దంతమూలీయంగాను ఉండటం మనం గమనించవచ్చు. ఇట్టి రెండు రకాలైన ఉచ్చారణలు ప్రస్తుత యుగంలో కూడా ఉండి ఉండాలి అని చెప్పడానికీ ఒకే ఒక వ్రాత ఆధారం కనిపిస్తుంది. పుత్సుకొని ( SII 6.745 10, 1398) < పుచ్చుకొని. దీన్ని ఈ క్రింది అచ్చులమార్పు స్పష్టంగా బలపరుస్తుంది.

ధ్వనుల మార్పు :

    4.6. అ>ఎ;ఎ>అ : ఈ యుగంలోని శాసనభాషలో తాలవ్యహల్లు తర్వాత అకారం ఎకారంగాను, ఎకారం అకారంగాను మార్పుచెందడం తరచుగా కనిపిస్తుంది. ఇందు అ>ఎ మార్పు తత్సమాల్లోనూ, ఎ>అ మార్పు దేశిపదాల్లోను మాత్రమే కనిపించడం గమనార్హం. 
 (అ) ఆ>ఎ : విజెయువాడ (SII.4.754.6, 1135).
                   యెధోచిత (పై. 6.982,20, 1296),
                   శెంఖు (పై. 6.1052.11.1350) మొ వి.
 (ఆ) ఎ>అ : యఱ్యన (పై. 4.945.29, 1152),
                   యవ్వరు (NI. 1.17.18, 1218),
                   యట్లు (ఎట్లు) (పై. 1.23.20,1347),
                   యనక<యెనక<వెనక (NI. 2 100.16.1195)మొ.వి.
   పై ఉదాహరణల్లో ఆ>ఎ మార్పు తాలవ్యహల్లు లన్నింటి తర్వాతనూ, ఎ>ఆ మార్పు కేవలం యకారం తర్వాత మాత్రమున్నూ కనిపిస్తాయి. అంటే దేశిపదాల్లో ఉన్నటువంటి ‘చ’ దంతమూలీయంగా పలకబడ్డంచేత  పైమార్పు లేవీ దేశ్యచకారం తర్వాత జరగలేదన వచ్చు. తత్సమాల్లో తాలవ్యం తరవాత తాలవ్యేతర అచ్చు పరమైతే తాలవ్య హల్లు దంతమూలీయంగా పలకడమో లేక అచ్చులో మార్చు చెందడమో జరగవచ్చు. పై ఉదాహరణల్లో అచ్చుల మార్పును మనం గుర్తిస్తున్నాం. దేశిపదాల్లో ఎకారం అకారంగా మారడాన్ని బట్టి ఎ (అనగా యె) కొద్దిగా వివృతంగా ఉచ్చరింపబడేదని ఊహించవచ్చు.
   (ఇ) పై ఆ>ఎ మార్చు దేశిపదాల్లో ఒక్కదానిలో మాత్రం ఈ యుగంలో ఒక ప్రాంతంలో జరుగుతున్నట్లు కనిపిస్తుంది. చల్లు>చెల్లు, ఈమార్పు ఈయుగా