పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

86

తెలుగు భాషా చరిత్ర

(1) పురుష ప్రత్యయాలున్న వాటిలో '-తు. -దు, -డు, -0_' అనే సపదాంశాలు తద్ధర్మార్థక ప్రత్యయాలు, ధాత్వంతణకారం తర్వాత డాదిసపదాంశమూ, నకారం' తర్వాత తాదిసపదాంశమూ వచ్చేవి. ధాత్వంతాచ్చు తర్వాత దాది సపదాంశం కనిపిస్తుంది. 'కల' అనే అసంపూర్ణ క్రియమీద శూన్యసపదాంశం వస్తుంది. ఉదా. కొణ్‌-డు-మ్‌ (నేటి 'కొందుము'కు పర్యాయరూపం) (తె. శా. 1 163-65.34, 892-922), కొణ్-డ్‌-ఱు ( SII 10.633.4 8 ), కాన్‌-తు-రు (రా. ప. సం. 187-89. 20, 1018), ఉణ్డు-దు-రు (పై. 23), కల-Ø-ర్‌ (తె. శా. 1.163-65.72, 822- 922), కళా-Ø-ఱ్ ( EI 30.12.26.8). *కలవారునుంచి *కలారు అర్వాచీన కాలంలో ఏర్పడ్డదన్న సంప్రదాయవ్యాకర్తల ఊహ సరికాదని, కలరు కలారులు అన్యోన్యం పరిమాణాత్మక రూపాంతరాలని గ్రహించాలి (2) పురుష ప్రత్యయాలులేని తద్ధర్మార్థకసమాపక క్రియలలో -ఉ(న్‌) అనే అర్థక ప్రత్యయం కనిపిస్తుంది. ఉదాః-అగ్‌-ఉ (పై. 27.228-229.8. 600-25), వలయ్‌-ఉం (తె. శా. 1.163-65 30-31. 892-922).

    3.49. తద్థర్మార్థక విశేషణం : తద్ధర్మార్థక విశేషణ ప్రత్యయాలు రెండు రకాలు: '-ఉ(న్‌)-,-Ø-'లు ఒకరకం; 'ఎడి,-ఎడు,-ఏ, -ఏట్టి'లు రెండోరకం. ఉదా. (i) పంప్-ఉ. (EI 27-221-25.7-8, 575-600), తెచ్చ్-ఉన్‌ (SII 4.1015.11. 1084), అన్‌-Ø (ఆం. ప. 1941-42.5,600.25), కల-Ø. (SII 6.585.11. 633-63 ), వణ్డ్  -ఎడి (పై. 4.1015.11, 1084), ఏళ్-ఎడు (శా. ప. మం.  12-3.30, 898-934). అ-ఏ (*అయ్యే అనటానికి బదులు తప్పుగా, SII 4.1029,10), 1100 ఆప్‌-ఏట్టి (*అనేటి అనటానికిబదులు తప్పగా, పై. 6 586.8, 1074). చివరి రెండు రూపాలనూ గమనించేది.
    3.50. విధ్యర్ధకం : నడుపునది (పై. 5.1144.7. 1069) అనే విధ్యర్థకరూపం ఒక్కటే లభించింది. ఇది ధాతుజవిశేషణంగా, విశేష్యాలకు ముందు వచ్చినప్పుడు విశేషణంగా, క్రియాపదంగా, కూడా భావించదగ్గది. నిర్మాణక్రమాన్నిబట్టి దీన్ని పురుషత్రయం చేరిన తద్ధర్మార్థక సమాపకక్రియగా పరిగణించవచ్చు. కాని ఆ  క్రియారూపానికి దీనికిలాగా విధ్యర్థంలేదు. -అది అనేదాన్ని నిర్దేశసర్వనామ ప్రత్యయమని భావించవచ్చుగాని దీనికి పురుషబోధకత్వంలేదు. ప్రథమ మధ్యమ పురుషల్లో రెండు వచనాల్లోనూ ఇది ఒకే రూపంలో ఉంటుంది. కానీ