ఈ పుటను అచ్చుదిద్దలేదు
ప్రాచీనాంధ్రం : శాసన భాషా పరిణామం
85
AR 233/1949-50.8, 8), ఇచ్చ్-ఇతి-మి (SII 10-10-12, 1078), ఇచ్చ్-ఇన్-ఆణ్డు (AR 77/1956-57 14-15,1096), ఐ-0-రి (SII 6.102 35, 1006). పైవాటిలో 'ఇ' మధ్యమపురుష మహన్మహతీ బహువచనాలకు ముందువచ్చేది. -ఇతి- ఉత్తమ మధ్యమ పురుషల ఏకబహవచనాలకు ముందు వచ్చేది రెండోవర్గానికి చెందిన ప్రత్యయాలు 'ఇయె (న్) ఎ(న్-ఉ)' అనేవి పథమ పురుషైకవచనంలోను, ప్రథమ పురుషలోని ఆమహద్భహువచనానికి ముందూ వచ్చేవి. ఉదా :- ఇయె(న్) : పడ్ -ఇయె. (పై. 641.6, 8), పడ్-ఇయెన్ (పై. 632 3, 3,725-75) : -ఎ-: నిల్ప్-ఎ (NI 1.287.4,650); -ఎన్-:నిల్ప్-ఎన్ (భారతి 5.618 12,897), కట్ట్-ఎను (పై. 473-84. 7,848), -ఎన్- ప్రత్యయం బహుశా -(అ)న్ అనే పురషవాచక ప్రత్యయంతో కలిసి ఏర్పడ్డ సంసక్త సపదాంశం కావచ్చు.
3.46. క్తవదర్థకం : -ఇన, -న, ప్రత్యయాలు క్తవదర్ధంలో వచ్చే సపదాంశాలు. హలంతధాతువులమీద సాధారణంగా నిలిచే ప్రత్యయగత ఇకారం ధాతుగతయకారం తర్వాత నిత్యంగా లోపించేది. ప్రత్యయాచ్చు లోపించిన సందర్భాల్లో వర్ణసమీకరణంవల్ల వచ్చేకొన్ని మార్పులను ఇంతకముందే సూచించాం. ( § 3 43 ). ఉదా:- ఇచ్చ్-ఇన ( 27.225.28.4, 575-600 ), అయ్-న (పై. 24 183-93.5, 825), ఇడ్-అ (శా.ప.మం. 1 2-3 41,898-934).
3.47. క్త్వార్ధకం : క్త్వార్ధకంలో -ఇప్రత్యయం వచ్చేది. ధాతుగతయకా తర్వాత మాత్రం దానికి పాక్షికలోపం కలిగేది. ఉదా. అయ్-ఇ (EI 29 160-64.8, 680), ఆయ్ - Ø (శా. ప. మం, 1.2-3-27, 898-934). అయితే క్రీ. శ. ఎనిమిది తొమ్మిది శతాబ్దుల్లో కనిపించే పొడిచ్చి (SII 10,614, 7,8). పొడుచి (పై. 632.3, 725.75), పొడుచ్చి (పై. 626.4, 848-92) అనే రూపాలు ఆధారంగా మూలద్రావిడ భూతకాలిక ప్రత్యయం *-చి అప్పటికింకా నిలిచిఉందేమోనన్న సందేహం కలుగుతుంది. *పడియె.* పడె అనే భావితరూపాలకు బదులుగా శాసనాల్లో పడి-చె (పై. 629.9,835) వంటి రూపాలు కనిపించటం ఈ సందేహాన్ని దృఢపరున్తున్నది. ఈ రూపాలన్నీ రాయలసీమ దక్షిణ ప్రాంతాల్లోనే ఉండటం మరో విశేషం.
3.48. తద్ధర్మార్థకసమాపకక్రియ : తద్ధర్మార్థక సమాపకక్రియలు రెండురకాల నిర్మాణంతో కనిపిస్తాయి : పురుషబోధక ప్రత్యయాలున్నవీ, లేనివీ.