ఈ పుటను అచ్చుదిద్దలేదు
ప్రాచీనాంధ్రం : శాసనభాషాపరిణామం
87
ఉత్తమ పురుష రెండువచనాల్లోనూ దీనికి ప్రయోగంలేదు. 'ఉన్-అది' అనే ప్రత్యయాలద్వారా విధ్యర్థమిచ్చే క్రియాపదంగా వర్ణించవచ్చు. అందువల్ల దీని నిర్మాణ సంక్లిష్ణతను ఏదో ఒకవిధంగానే వర్ణించటం సరికాదు. దీనికి ఆధునిక రూపం 'నడిపేది'.
3.51. చేదాద్యర్ధకం '_ఇనన్, _నను' అనేవి చేదాద్యర్థక ప్రత్యయాలు. -నను లోని చివరి ఉకారం అపదాంశ మనవచ్చు. ధాత్వంతయకారం మీది ప్రత్యయాది ఇకారం లోపిస్తుంది. కొన్ని సమయాల్లో ఈ ప్రత్యయాద్యచ్చు లోపించి వర్జసమీకరణం జరిగినందువల్ల పదమధ్యసంధి కలుగుతుంది. ఉదాః కట్ట్-ఇనన్ (పై. 10.599 30, 625-50), కొణ్-ణన్ (పై. 631.8, 9/10), ఆయ్-ననుం (తె. శా. 1.163-65. 34-35,892-922).
3.52. ప్రార్ధనాద్యర్థకం : ప్రాతిపదిక పురుష ప్రత్యయాలమధ్య ఏ ప్రత్యయమూ చేరకుండనే ప్రార్థనార్థక క్రియరూపమేర్పడుతుంది. అలాంటి సమయాల్లో ధాతుగత దీర్ఘాచ్చుమీద అద్విరుక్త హల్లుగాని, హ్రస్వాచ్చుమీద ద్విరుక్తహల్లుగాని నిత్యంగా రావటం కద్దు. ఉదా కో-Ø-మ్మ్ ( పై.32), మను-Ø-ము (పై. 67), పో- Ø -మ్ (NI 1.245.5, 10).
3.53. తుమర్ధకం : -ఆ(న్), -అంగ మొదలైన సపదాంశాలు తుమర్ధంలో ధాతువులమీద చేరుతాయి. (o)గ అన్నది 'కా' అనే అసంపూర్ణక్రియారూపమే. ఇది ఉన్నా లేకపోయినా అర్థలోపంగాని భేదంకాని, లేదుకాబట్టి దీన్ని అంశాభాసంగానే పరిగణించాలి. ఉదా. ఏళ్-అన్ (EI 27.221-25 5, 575-600 ), ప్రవత్తి ౯ల్ -ఆ ( SII 10 23,2-3, 719-20), ఓప్ప్-అంగ (భారతి 5.473-84.3-4 848), నా-Ø (రా. ప. సం. 25-29.7, 1095). చివరిపదం *అనం అనే క్రియారూపంలో వర్ణవ్యత్యయం వచ్చినందువల్ల ఏర్పడ్డది. ప్రాతిపదికాంత దీర్ఘాచ్చుమీది ప్రత్యయాది అకారం లోపించింది.
3.54. శత్రర్థకం : శత్రర్థంలో ధాతువుమీద చుప్రత్యయం వచ్చేది. ఉదా. ఏళు-చు (EI 27.231-34. 5-6, 625-650). శత్రర్థక క్రియారూపానికి ఉండు ధాతు రూపాలను అనుబంధించి వర్తమానకాలిక క్రియలను నిర్మించేవారు. వృత్తవర్తిష్యమాణ క్రియరూపాలు తెలుగులో డొంకతిరుగుండు నిర్మాణం వల్లనే ఏర్పడుతాయి.