పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

Nచేస్తే తరువాత చాలా చిక్కులలో పడిపోచారు. శాస్త్రంచూడవలెను. అతను యీ మాటలు స్వలాభంకోసం చెప్పుచూవున్నాడు గాని పరమార్దంచూచి చెప్పడం లేదు.

కొంక - నీవు నీ లాభం కోసమే చెప్పుచూవున్నావుగాని పరమార్ధచింతతో చెపుచూవున్నావా ? పీనుగుయీంట్లోవుండగా వాళ్ళదుఃఖం చూచి భరించడం మహాకష్టం. వృషభేంద్ర రావుగారూ! అతని తెలివితక్కువ మాటలు విని మీరు మోసపోకండి. అతను యెంతసేపైనా వూరికే వాగుతూనే వుంటాడు. తెల్లవారిందాక అట్టేవుంచితే యితనూ యితనిచుట్టూవుండే కోతులచటృమూ మిమ్మలిని వేవుకు నితించారు. నిండిన యింట్లో శవలవంవుడకూడదు. సరంజాం చేయించండి .

రామ - చేయించకండి. వొరేదీక్షతులూ మోటతనం కొంక నక్క చేష్టలుమాని పెదలువచ్చిందాక వోపికపట్టు. ధూర్తుతనమే కాని నీకు శాస్త్రంయేమీ తెలియదు.

కొంక - ఓ పక్షికుంకా! వూరికే యెగిరిపడడమే కాని నీకుమాత్రం మహా శాస్త్రం తెలిసియేడిసిందిలే. నీవుపీనుగులను పీక్కుతినే పక్షిముండా కొడుకువు. నామాటకడ్దంరాకు.

రామ - నీ నక్క జిత్తులు నాకు తెలుసును. మా కేమీ లేకుండా అంతా నీ నోట్లోనే పడవేసుకోవలెనని చూస్తూవున్నావు నీ వెన్నికూతలు కూసినా పెద్దలంతా వుంటూవుండగా నీగంతులుసాగవు . వీమాత్రం పీనుగులను పీక్కుతినే ముండాకొడుకువుకావా?

కొంక - నక్క నోటగడ్డకొట్టి అంతానీవే మిృంగవలేనని నీవుచూస్తూవున్నావు. నాదేహంలో ప్రాణంవుండగా నీకుడక్కనిస్తానా ? నేను పీనుగులను పీక్కుతినే ముండాకొడుకునా ?

వృష - మీరుఇద్దరూ పీనుగులను పీక్కుతినే వారే. ఆ మాటలు యిప్పుడెందుకు వూరుకోండి. ఇష్టంవుంటే అవతలకు పోయి పోట్లాడుదురుగాని యిప్పుడు శవం బయటకు వెళ్ళే సాధనంచూడండి . యెవరిలాభం నిమిత్తం వారు చూచుకోక వుభయలూకూడా న్యాయం విచారించండి.

కొంక - మీరు సెలవిచ్చిన మాట . (రహస్యముగా) శవాన్ని తెల్లవారిందాకా ఇంట్ల్లోపెడితే రేపుతానూ తనబంధువులూ వచ్చి తినవలెనని ఆ పక్షిముండా కొడుకు ప్రయత్నం . శవాన్ని రాబందులు పీక్కుతిననిస్తే బహుపాపము. బ్రతికినన్నాళ్ళూ గొప్పగా బ్రతికిన కామధేనువును చచ్చినతరువాత పక్షులనోట్లో పడనియ్యకండి. నేనూ మీచతుష్పాదకో