పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిర్యగ్విద్వన్మహాసభ

రామ -- దహనం చెయ్యడమంత ఆక్షేపణార్హమైనపని మరివకటిలేదు. ఎక్కడనైనా మనుష్యులకు దహనం వున్నదిగాని గోజాతికి దహనం వున్నదా?

{{Css image crop
|Image = %E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%97%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81_%E0%B0%AE%E0%B1%82%E0%B0%B7%E0%B0%95%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B0%82.pdf
|Page = 6
|bSize = 401
|cWidth = 365
|cHeight = 168
|oTop = 87
|oLeft = 21
|Location = center
|Description =
}}


రామబంధుశాస్త్రిగారు మార్జాలపంతులుగారు
అశ్వ - అయినా యీసంగతి సభాపతులందరూ వచ్చిన తరువాత ఆలోచించి యేమిచెయ్యడానికీ నిశ్చయం చేతాము.
కొంక--ఇది ఆసభాపతులతో ఆటోచించనక్కరలేదు. ఇందులో మేమే ప్రధానులము.వ్యాఘ్రావధానులు యేమయినా సరే అంటాడు. మాలోకలిసిరాడు. వరాహభట్టున్ను బకసోమయాజులున్ను యీవిషయంలో ధర్మనిర్ణయం చెయ్యడానికి అర్హులుకారు.
రామ-ధర్మశాస్త్రాలు చూచిననేను సిద్ధాంతంగా చెపుచూవున్నాను. ఈవిషయ౦లో దహనకర్మ యెంత మాత్రమూ వల్లపడదు.
కొంక -- రామబంధుశాస్త్రి ఆలాగుదృఢంగా చెపుచూవున్నాడుగనుక ఖననకర్మకు శవాన్ని యిప్పుడే ప్రేతభూమికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చెయ్యండి.
రామ - యీరాత్రియేకర్మా చెయ్యకూడదు ధర్మశాస్త్రం చూడవలెను. తక్కినసభాపతులంతా వచ్చినతరువాత రేపువుదయాన్నే అందరితోనూ ఆలోచించి మరీచేతాను. పెద్దలంతావుండగా స్వతంత్రించి యేపనిచెయ్యడమూ భావ్యం కాదు. శవాన్ని తెల్లవారిందాకా అట్టే వుండనియ్యండి.
రామ - వృషభేంద్రరావుగారూ! మీరతనిమాటవిని తొందరపడకండి. నేను యిప్పుడే చెప్పుచూవున్నాను. మీరుతొందరపడి సభవారి ఆలోచనలేకుండా