పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిర్యగ్విద్వన్మహాసభ

భైరవమూర్తిగారు.
[భైరవమూర్తియు, మార్జాలపంతులును, కొంకనక్క దీక్షితులతోను రామబంధుశాస్త్రితోను ప్రవేశించుచున్నారు]
కొంక - ఏమయ్యా! వృషభేంద్రరావుగారూ! రాత్రి పడుతూ వున్నా యింకా శవాన్ని అట్టేపెట్టుకుని కూర్చున్నారు? వెంటనే సమాధి ప్రయత్నం చెయ్యండి.
వృష - మావాళ్ళు దహనంచెయ్యవలెనని ప్రయత్నం చేస్తూవున్నారు. సభాపతులకేమీ ఆక్షేపణ లేదుకదా?
కొంక - మాకు కావాలసినంత ఆక్షేపణవున్నది. పూర్వాచార విరుద్ధమైన కార్యంచెయ్యగూడదు.
కొంకనక్క దీక్షితులుగారు.