పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

113 తిర్యగ్విద్వన్మహాసభ.

గోదేవి-అయ్యా!దీనులకోరికలను కొనసాగించే కామధేనువు పోయిన తరువాత మేముయెట్లా యేడవకుండా వుండగలము! యిఖ మమ్మలిని పోషీ౦చే దిక్కెవ్వరున్నారు? ఓకామధేనువా ! నీగుణాలు తలుచుకుంటే దుఃఖం పొర్లిపొర్లి వస్తూవున్నది.

వృషభేంద్రరావుగారు గారు.

వృష-ఓకామధేనువా! లోకములోమమ్ము వంటరిగాళ్ళనుచేసి పొయినావా! ఇదివరదాకా నీపొృపుమాకు వు౦డడ౦చేత పెద్ధపులయినా మావ౦క తేరిచూడడానికి భయపడుతూవండేవి.నీవులేకపోవడంచేత నక్కపోతు లుకూడామమ్ములోకువచేస్తవిగదా? మేషే-ఆశ్వపతిగారూ!నక్కలంటే జ్ఞాపకమువచ్చినది.బ్రతికివున్నంతకాలమూ లోకోపకారముగా పెరిగిన యీశరీరమును నక్కలపాలూ రామబందూపాలూ కానియ్యగూడదునుమండీ.మనమిత్రమయిన కామధేనువు మనతోయెప్పుడూ యీసంగతే ముచ్చటిస్తూ వుండడం మీ రెరుగుదురు గదా?

అశ్వ-అవును మనలో యిదివక చెడ్డదురాచారంగా వున్నది.మనంగౌరవించే శరీరమును మనకళ్ళయెదుట నక్కలూ రాబందులూ పీక్కు తింటూవుంటే యెట్లాసహించగలము?ఈకళేబరమును తప్పకుండా దహన మమే చేయింతాము.

వృష-అవశ్యంగా దహనమే చేయింతాము.

గోదే-"గోబ్రహ్మణేభ్యః" అన్నాడూగనుక,వెనుకచెప్పిన గోవుల కెందుకుజరనగగూడదు?అగ్నిసంస్కారం జరుగు తూ వుండగాముందుగా చెప్పిన గోవుల కెందుకుజరగగూడదు? వ్రష-మనభైరవమూర్తిన్నీ మార్జాలపంతులున్ను సభాపతులను తీసుకుని వస్తూవున్నారు.వారితో ఆలోచింతాము.