పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూషికాసుర విజయము 137

భార్య: అలాగే వుంటాను. (అని వక నాగటిచాలులో దాగుకొను చున్నది.)

మూష: నీ ప్రియరాలా... సరిగా నేను చెప్పినట్లు చెయ్య వలెను సుమా... నే నా కుందేలు వద్దకు వెళుతూ వున్నాను. (అని నడుచు చున్నాడు)

(అప్పుడు శసకపతి రావు మరల ప్రవేశించుచున్నాడు) శశ... ఓ మూసక భట్టాచార్యా... ఈ కాస్త దూరమునీవెంత సేపు నడిచావు. నీవు పందెం గెలిచే లక్షణం ఆరంభములోనే కనపడ్డది. నీ కోసం నేను ఎంతో సేపటినుండి ఎదురు చూస్తూ వున్నాను.

మూష: నేను పరుగెత్తలేక మెల్లిగా నడిచినా వనుకున్నాయేమిటి? తలుచుకుంటే నీకంటే పది రెట్లు వేగంగా పరుగెత్తగలను. నేను చదువుకున్న వాణ్ణి గనుక భోజనం చెయ్యడంలోపే పరుగెత్తడం దేహారోగ్యానికి మంచిది కాదని మెల్లిగా పెళ్ళి నడక నడిచి వచ్చి నాను. నీవు ఆ మాత్రం గ్రహించ లేక పోయి నావు.

శశి: నీ పాండిత్యానికేమి గాని మనం వేసుకున్న పందెం ప్రకారము పరుగెత్తుదాము వస్తావా?

మూష: తప్పకుండా వస్తాను. పరుగెత్త వలసిన స్థలం యేదో నీకు తెలుసునా? సరిగా ఆ కంచె మీద వున్న బీర పాదు వద్దకుపరుగెత్త వలెను.

శశి: మంచిది. సరేనా? పరుగెత్త వచ్చునా? ఆరంబించు. ( అని వాయు వేగ మనో వేగమున పరుగెత్తు చున్నాడు)

మూష: ఇదిగో ఆరంభించినాను. (అని నాలుగడుగులు వేసి నాగటి చాలులో నడిగి స్వస్తముగా కూరుచుండి) అదిగో అప్పుడే కుందేలుగాడు బీఅ పాదు దగ్గరకు వెళ్ళినాడు? నాపెళ్ళామక్కడ సిగ్ఘంగా వుంది. నేను చెప్పినట్లు చెయ్య వచ్చును. వీడు నామాయలో పడి పోతాడు.

శశ: ఇదిగో నేను పరుగెత్తుకొని వచ్చినాను.

భార్య: (మూషకాంబ) నీకంటే ముందుగానే నేను వచ్చినాను.

శశ: (అద్భుతేపడి తనలో) ఇది యేమి? ఇంగ్రజాల మహేంద్ర జాలముగా వున్నది. (బిగ్గరగా) ఓ మూషక భట్టరా? మళ్ళీ పరుగెత్తుదాము రా, వక్కమాటుతో నాకు నమ్మకం లేకుండా వున్నది.

భార్య్త: మంచిది. అలాగే పరుగెత్తుదాము.

శశ: ఇదుగో బయలు దేరుతూ వున్నాను. ( అని మున్ముపటి కంటేను వేగముగ పరుగెత్తుచున్నాడు.)

మూష: అదుగో శశకపతి గాడు మళ్ళీ యిటుకేసి పరుగెత్తుకుని వస్తూ వున్నాడు. నాభార్య వాణ్ణి మోసం చేసింది. అదిప్రతివత అయినందుకు సందేహము లేదు.