పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూషకాసుర విజయము.

శశ-ఈవైపుకు నేను ముందుగా వచ్చినాను. మూష - (పైకిలేచి) లేదు. ఇక్కడికీ నేనే ముందుగా వచ్చినాను.

శశ - (తనలో) వీడివద్ద దెయ్యాలమంత్రం వున్న దాయేమిటి? ఇది పెద్ద మోసంగా కనపడుతూ వున్నది (బిగ్గరగా) ముఖ్యంగా మూడుసార్లు పరీక్ష చెయ్యవలెను. ఇంకొక మాటు కూడా పరుగెత్తుదామురా.

మూష: నీవెన్ని సారులు పరుగెత్తుదాంటే అన్ని సారులే పరుగెత్తుదాము. లక్ష సారులు పరుగెత్తినా నాకు వచ్చిన భయం లేదు.

శశ: అలాగైతేరా. (అని పరుగెత్తి) ఈ సారైనా నేను ముందుగా వచ్చినానా లేదా?

భార్య: (పయికి లేచి)లేదు. నాకంటె నీవు వేయి రెట్లు వెనుక వచ్చినావు.

శశి: ఈ వొక్క సారి కూడ పరుగెత్తు. మొదట బయలు దేరిన స్థస్లానికి మళ్ళీ వళుదాము. ంఆ మాటు కూడ నేను వోడిపోతే నోవు గెలిచినట్లువప్పుకుని పది వరహాలూ యిచ్చి వెళ్ళిపోఎతాను. (అని పరుగేత్తి) ఒప్పుడు నీవు ముండా నేను ముందా?

మూష: నేనే ముందు. నాఫది వరహాలు నాచేతిలో వేసి యింటికి యేడుస్తూ వెళ్ళు. ఇప్పటికైనా నన్నాక్షేపించి నందుకు నోకు గర్వ భంగం అయిందా? ఇఖ ముందెప్పుడూ ఎవరిని అక్షేపించక యీ పరాభవముతో బుద్ధి తెచ్చుకో.

శశ: ఇవుగో వరహాలు పుచ్చుకో. (అని యిచ్చి వెళ్ళిపోవు చున్నాడు.

మూష: (భార్వ వద్దకు మెల్ల నడిచి వచ్చి) ఓ ప్రియురాలా... నన్ను నీవు గెలిపించి నావు. ఇది నాకు పధమ విజయం. ఈపది వరహాలతోనూ నీవు నగలు చేయించుకో భార్యా భర్తలు ఐకమత్యంగా వుంటే యెప్పుడూ యిటువంటి లాబాలు వస్తవి.

భార్య: నాకు నగలు అక్కర లేదు. ఈ వరహాలతో మీ అప్పులు తీర్చుకొండి. ప్రొద్దెక్కింది యింట్లోకి వెళుదాము రండి.

(అని యిద్దరు నిష్క్రమించు చున్నారు.