పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిర్యగ్విద్వన్మహాసభ.

రామ---కులం తక్కువవాడవు నీవా మమ్మలిని మందలింఛేవాడవు? వోపందీ! అట్టేకుయ్యక వూరుకో.

వరా---కావలిస్తే నీవు కులంతక్కువవాడవు. నేనుకేవలమూ ఆదివరాహస్వరూపుడయిన విష్ణుమూర్తి సంతతివాణ్ణీ ఓపక్షికానా! అగిరిపడబోకు.

కొంక---అలాబుద్దిచెప్పు.

రామ---నీ నక్కజిత్తులు చాలించు. [అప్పుడాంజనేయశర్మయు, మర్కటజోస్యులును, మల్లుభట్లును, తిమ్మన్న చయనులును, ప్రవేశించుదున్నారు.]

అంజ---ఏమిషయ్యా! మెలోమీరే కేకలు వేస్తూవున్నారు? సభవారితో యేమయినా ఆలోచించడమూ పెట్టడమూ వున్నదా లేదా?

రామ---ఆంజనేయశర్మగారు యేళ్ళుగడిచినవారు ధర్మశాస్త్రవేత్తలు లోక