పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126తిర్యగ్విద్వన్మహాసభ.

వక్కటిలేదుకాని వాడు శ్రీరాములవారినిమిత్తం లంకకాల్చివచ్చిన ఆంజనేయులవారి అపరావతారులు. "అయ్యా! ఆంజనేయశర్మగారూ! కామధేనువు వచ్చిపోయినదిగదా? యీరాత్రి కర్మచేయించి శవాన్ని తీసుకుపోవచ్చునా?"

అంజ---(తనలో)యేలాగయినా మనకు లాభముదొరికేమార్గం చూడవలెను. (బిగ్గరగా)_ తీసుకుపోకూడదు.


కొంక---నావద్ద కోతిచేష్టలుచెయ్యక యిప్పుడు యెందుకుపోకూడదో చెప్పు.


అంజ---ఇప్పుడు తీసుకువెళ్ళీనా రేపుతీసుకువెళ్ళీనా ముందుగా ప్రాయశ్చిత్తం కావలెను.

మేపే---ఇదేమిటయ్యా! నీవువచ్చికొత్త గొడవ తెచ్చిపెట్టినావు. లోక మంతా మెచ్చుకొనే కామధేనువుకు ప్రాయశ్చిత్తం యెందుకయ్యా.

అంజ---ఎందుకోనీకేమి తెలుస్తుంది? చిన్నప్పటినుంచీ ధర్మశాలస్తాలలో పుట్టిపెరిగిన మావంటివారికి తెలుస్తుందికాని కామధేనువు బ్రతికివున్నకాలంలో మహాపాతకం చేసింది కాబట్టి ప్రాయశ్చిత్తం కాకతీరదు.

వృష---ప్రాయశ్చిత్తంమాట చూచుకుందాము గాని చేసిన పాపమేమిటో చెప్పు.

అంజ---కావలసినన్ని పాపాలువున్నవి. కృతఘ్నులయిన మనుష్యులకు పాలు మొదలయినవి యివ్వడం మొదటిపాపం. ముట్టుకోవడానికైనా అర్హంకాని కుక్కకు పాలివ్వడం రెండోపాపం. విశ్వాసమన్నమాట యెరుగనిపిల్లికి పాలివ్వడం మూడోపాపం. ఈపాపాలన్నీ క్షమించినా ధర్మశాలనికి ప్రత్యక్షవిరుద్దమయిన పశుగమనపాపం యేలాక్షమించడానికి వీలవుదుంది? ఆపాపం యెవరూ చెయ్యలేరుకదా? ఆ పాపం చేసినందుకు యిప్పుడు దగ్గిరకూర్చుండి యేడుస్తూవున్న యీవత్సిమే దృష్టాంకము. పశుగమనమే లేకపోతే యీదూడయేలాగుపుట్టినది? కలియుగానికి ముఖ్యప్రమాణమయిన పరాశరస్మృతియెక్క దశమాధ్యాయములో

శ్లో. పశువేశ్యాదిగమనే మహిష్యుష్ట్రి కపీం తధా ఖరీంద సూకరీం గత్వాప్రాజాసత్యం సమాచరేత్.

అని వున్నది. కాబట్టి పశుగమన ప్రాయశ్చింత్తం ముందుగా జరగవలెను.

వృష---వోరినీనోట్లోపుండుపుట్టా! ఎన్నికారుకూతలు కూసినావురా నాలుగుపోట్లుపొడిచి నీడొక్క బద్దలుచేస్తునా?

అశ్వ---వొరీ నీధర్మశాస్త్రం కాలిపోనూ! యీ కారుకూతలు ప్రేలినందుకు నెత్తి పెంకు యెగిరేటట్టుగా తన్నుదునా?