పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

61

ములో బకాళాభాత్ (పెరుగుఅన్నము) శనగపప్పు సహా ఆస్థానమవును.

3 ఆనిన రాస్థానము.

ఇది ప్రతిసంవత్సరము ఆనినెల ఆఖరు అడినెల మొదటి తేదీని జరుగును. ఈ ఆస్థానములో కూర్చుండువకకు సంవత్సరాది ఆస్థానములోవలె జరిగి శ్రీవారిపాదముల వద్దనున్న బీగములు, మొహర్లు ఆర్చకులు జియ్యాం గార్లకు విచారణ కర్తల వారికి వప్పగించిన తఱువాత ప్రసాదపణ్యారములు సంవత్సరాది ఆస్థానములోవలెనే వినియోగమయి ఆస్థానము సమాప్తమగును. ఈఆస్థానము దక్షిణాయనపుణ్యకాలమురోజునజరుగును. ఆస్థానానంతరము ధర్మ దర్శనమవును.

4 దీపావళిఆస్థానము.

ఇది దీపావళిరోజున జరుగను. దీనియందు పంచాంగ శ్రవణముగాని బీగముల మోహరుల నప్పగింతగాని ఉండదు. శేషము సంవత్సరాది ఆస్థానములోవలె జరుగును. ఆస్థానమునకు ముందు బ్రహ్మోత్సవపు ఆంకురార్పణ దివసమున దయ చేసిన మూర్తులు కళ్యాణమంటపము యాగశాలలనుండి శ్రీవారి గర్భాలయములోనికి విజయము చేసెదరు.

1, 3, 4 అయిటమ్ ల ఆస్థానములు పెద్ద ఆస్థానము అని పేరు. శ్రీరామనవమి, గోకులాష్టమి, కౌశిక ద్వాదశి ఆస్థానములు చిన్న ఆస్థానములనఁబడును.

5 శ్రీవారి తెప్పోత్సవము

ఇది దుర్మతిసంవత్సర ఫాల్గుణ శుద్దమందు జరిగినది. ఈ ఉత్సవము నూతనము దేవ స్థాసపు విచారణకర్తలైన