పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

తిరుమల తిరుపతియాత్ర.


వరులు) శ్రీతాయారుల సయితము రంగమంటపములో జోడించి యున్న బంగారు మంటపమనెడి సర్వభూపాలవాహసమందు దయచేసి వజ్రకవచము, రఘోజి భాన్సిలె మొదలగువారు సమర్పణచేసిన విశేషతిర్వాభరణములు (నగలు) సమర్పణ చేయబడిన తరువాత పుష్పాలంకారమయి, విశేషనైవేద్యములతో రెండవఘంట అయిన పిదప శ్రీమూలనరులకును శ్రీఉత్సవరులకును నూతనని స్త్రధారణమయి ఆస్థానవినియోగము నకు శ్రీవిచారణకర్తలవారు మొదలగు వారందఱుఁ గూర్చుం దురు. శ్రీవారికి నూతన పంచాంగము శ్రుతపరుపఁబడును. పంచాంగమును గుణించిన వారికి బహుమానము లొసంగఁ బడును, తఱువాత కొన్ని స్థలాచార పద్దతులు జరిగి లడ్డు, వడ, అప్పము, దోశ మొదలగు ప్రసా దములు దేవస్థానమర్యాదల ప్రకారము కైంకర్యపరులకు బహుమానమయి వినియోగమవును. ఆస్థానములో 11 A. M. ఘంటలకు పూర్తి అవును. ఆస్థానములో బ్రాహ్మణేతరులు కూర్చుం డఁగూడదు. అనంతరము ధర్మదర్శనమవును.

2 నిత్యోత్సవము.

ఇది సంవత్సరాది మొదలు 40 రోజులు జరుగును. ప్రతి సాయంకాలము శ్రీవారికి మాత్రము వెండితిరిచిలో వేర్వేరు వాద్యములతో వేద ప్రబంధసారాయణులతో ఊరుచుట్టు ఉత్స వము జరుగును. సంవత్సరాదిరోజున మాత్రము ఆస్థానాలం కారముతో తాయారుల సయితము ఉత్సవమవును. 40 రోజులును ఉత్సవానంతరము శ్రీధాన్యకారులవారి ముఖమంటప