పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

59

రోజులు వుదయము 8 ఘంటలకు శ్రీవారికి రెండవ నినేదన అయి బంగారుతిరిచిలో పునర్వసు ఉత్సనమునకుఁ జెప్పినమంట పమునకు విజయము చేసి యచ్చట ఉరుమంజనము, అలంకా రము, నివేదన, ఆస్థానవినియోగములు, ఉత్సవమయిన తఱువాత శ్రీవారు కొంతరాత్రి అయినపిదప దేవస్థానములోనికి విజయము చేసి నిత్యోత్సవాస్థానములయి శ్రీవారు సన్నిధి లోనికి దయచేసి తోమాలసేవ మొదలగునవి జరిగి తీర్మానమవును . మూడవరోజుగూడ ఇదేగతిగ జరుగును. సీతాలక్షణ హనుమత్స మేతముగ రాములవారు కూడా విజయము చేసెదరు. ఉత్సవము కన్నులపండుగగనుండును . ఈ మూడురోజులు రాత్రిపగలు రెండుపూటలు బ్రాహ్మణారాధన జరుగును. ఈయుత్సవము ఆధికారి శ్రీరామలఖన్ దాస్ జివారి ధర్మము.


అధ్యాయము. V

వివేషఉత్సవములు, ఆస్థానములు.

వీనిలో నొక్కొక్క ఉత్సవము సంవత్సరమున కొక్క తూరి వచ్చుచున్నవి. ఇందులో ముఖ్యమయిన వానినిఁ బేర్కొ నెదను.

1. సంవత్సరాది ఆస్థాగము.

ఇది ప్రతిసంవత్సరము ఆంధ్రసంవత్సరాది దినము జరుగును. ఈదివసమున రోజు 12 ఘంటలకయ్యెడుని వేదన ఉదయము 5 ఘంటలకయి శ్రీమలయప్పస్వామిపొరు (ఉత్స