పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

తిరుమల తిరుపతియాత్ర.


దక్షణముగ గుడిలోనికి విజయంచేయఁగ రాత్రి తోమాల సేవ మొదలగునవి జరుగును. శ్రీరాములవారు ఈ ఉత్సవము లో విశేషవస్త్రా౸భరణాలంకారభూషితులుగ నుందురు.

చిత్తానక్షత్రము.

ఇది శ్రీమైసూరు మహారాజుగారి జన్మనక్షత్రము. ప్రతి నెలకు చిత్తానక్షత్రమందు శ్రీవారికి మైసూరు మహారాజుగారి చె సమర్పింపఁబడిన దంతపు పనిచేసిన పాలకియం దుత్సవము జరిగి శ్రీవారి గంగమంటపములో పుళిహోర ఆరగింపయి ఆస్థానమందు వినియోగము జరుకొను. ఇది యుభయనాంచార్లస మేతమైన ఉత్సవము. అనంతరము రాత్రి తోమాల సేవ మొదలగునవి మామూలు ప్రకారము జరుగును.

ద్వాదశిఉత్సవము.

శ్రీమలయప్ప స్వామివారు (శ్రీ వెంక టేశ వుత్సవరులు) పగలు రెండవఘంట అయిన తఱువాత కొయ్యతిరిచిలో మహా ప్రదక్షణముగను త్తరపు వీధిలోనున్న శ్రీగద్వాల్ రాజు గారి ద్వాదశీమంటపమునకు విజయము చేసి యచ్చట శ్రీరాజుగారి ఏజంటు. వేసిన పుళిహోర, శనగపప్పు నివేదింపఁబడి ఆస్థా నమందు వినియోగమవును. అనంతఱము శ్రీవారు దేవస్థాన ములోనికి విజయము చేయ రాత్రి తోమాల సేవ మొదలగునవి పద్ధతి ప్రకారముజరుగును. ఇది శ్రీగద్వాలరాజు ధర్మము.

వసంతోత్సవము.

ఇది ప్రతిసంవత్సరము చైత్ర శుద్ధ త్రయోదశి మొదలు పూర్ణిమనరకు మూఁడుదినములు జరుగును. మొదటి రెండు