పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

తిరుమల తిరుపతియాత్ర.


శ్రీమహంతుప్రయాగ దాస్ జీవారిసలన ఏర్పాటు చేయబడినది. చూచుటకు కన్నులపండగగ నుండును

6 శ్రీవారి బ్రహ్మో త్సవము.

ఇది ప్రతీసంవత్సము అనఁగా అధికమాసమునచ్చినప్పుడు తప్ప నవ రాత్రులలో జరుగును. ఉత్సవ ప్రారంభమునకుపూర్వదివసమందు శ్రీవారిబ్రహ్మోత్సవ ఆంకురార్పణముజరుగును. ఈరాత్రి శ్రీవారిగర్భాలయములో శ్రీమూలవరులు భోగ ఉగ్ర మూర్తులుదప్పఇతరమూర్తులను శ్రీవారికళ్యాణమంటపములో నికిని,యాగశాలలోనికిని విజయముచేయించిదీపావళీఆస్థానమున రకుంచుదురు. ఈదినము రాత్రి నివేదన పెద్దఘంటకు ముందు శ్రీ సేనాధిపతి వారికి నాలుగు వీథులుత్సవముజరిగి తిరుమలరాయ మంటపములో ఆస్థాసము జరిగి రాత్రి ఘంటయి తీర్మానమవును. శ్రీవారి బ్రహ్మో త్సవమునకు అన్నిపనులు శిద్దముగాఅయి నవా? అనుటకొఱకును నుృత్సంగ్రహణముకొఱకును ఈఉత్సవముజరుగుననిభావము, శ్రీవారి బ్రహ్మోత్సవము మంత్ర యుక్తముగా హోమములతో జరుగును.

మొదటిరోజున____

1 ధ్వజారోహణోత్సవము.

2 పెద్ద శేషవాహనము.

ఈదినమున విశ్వరూపదర్శనము, తోమాల ళేవ, అర్చనఘంట అయి శాత్తు మొరకుముందుగ నే శ్రీవారిని ఉభయ దేవుల సమేతముగ బంగారు తిరిచిలో విశేష తర్వాభరణాలంకారము చేసినతరువాత మంత్రయుక్తముగ కొన్ని క్రియలు