పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

తిరుమల తిరుపతియాత్ర.

నుండి చంద్రగిరికి రాజధానిని మార్చెను. వీరి కాలములోనే ఘంటామంటపములు కట్టించెరనీ వదంతి. వీరుమిగుల భక్తులు, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానములో ప్రతిదినము రేయింబగళ్లు నివేదన కొలనులో పెద్దఘంటలు వాయించెదరు. ఆని నాదము 3 మైళ్లు వినబడును. దేవస్థానమునకు 3 మైళ్లదూరములో నొక మంటపం ఘంటయు నీరు కట్టించినారు. దేవస్థానములో నివేదనఘంటకాగానే యీఘంట వాయించబడుచుండెను. అనినాదము చంద్రగిరికోటకుచేరగా అచ్చట దేవతా నీవేదనయి తాను భుజించుచుండెననీ చెప్పెదరు. వీరి పుత్రులలో నొకరు శ్రీహ త్తిరాంజీ వారికి శిష్యులయి శ్రీ మహంతు గిరిధర దాస్ జినామమున శ్రీహ త్తిరాంజీ మఠమునకు మూలపురుషుని తర్వాత మహంతుగా నుండెను.

శ్రీరంగరాయ 11 పరిపాలనలో శా# 1499 సేవప్పకుమారు డచ్చుతప్పనాయక్ (తంజావూరు) వల్ల ఈ దేవస్థానము మరమ్మతు చేయబడినట్లు తేలియఁ గలదు. పూర్వము పల్లవవంశీకుడై న కోపార్థివేంద్ర వర్మ౯ తమయొక్క 14 వత్సరపు పొలనంబులో చాలా వ్యయము చేసి శ్రీవేంకటేశ్వర స్వామివారి గర్భగృహమును నూతనముగా కట్టించిరి. తర్వాత త్రిభువన చక్రవర్తి వీరనరసింహ్మ యాదవరాయుల కాలములో దేవస్థానము. చాలాభాగము నూతనముగా కట్టబడినది.

ఈ విజయునగరపు వంశములో ఆఖరు రాజయిన శ్రీరంగరాయులు 1646 క్రీస్తు॥ శ॥ చంద్రగిరిలో పాలించెను వీరికి నామకార్థములో బడిన సామంతరాజులుగా తంజావూరు, మధుర, చన్నపట్నం, శ్రీరంగపట్నము రాజులుండిరి. వీరు 1660–వ వత్సర