పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల యాత్ర

121

ములో పులికట్ వద్ద ప్రముఖులు గా నుండిన డచ్చి వారు వలదని నను వినక ఈస్టిండియా కంపెని వారికి మద్రాసు నొసగిరి. వీరు భక్తి శ్రద్దలతో దేవస్థానమును పరిపాలించినట్లు చెప్పుతారు.

క్రీస్తు శకము 1644 లో బిజపూరు సుల్తానులు కర్నాటక మును దండెత్తటకు రందూల్ ఖా౯ షహాజి, అను ఇరువురు సేనానులను బంప వారు చంద్ర గిరి, గింజిలను లోబరుచుకొనగ శ్రీ రంగరాయలు ఉత్తర కర్ణాటములో కొంత కాలము దాగి తుదకు 1646. వ సంవత్సరములో బెడ్నూరుకు, బోయి సామంత రాజయిన బెడ్నూరు ప్రభువువద్ద దాగెను. ఈ రాజుతో ప్రసిద్ధి కెక్కిన విజయనాగర వంశస్థుల పాలనంబంత్యమేగాక హిందూ రాజుల పరిపాలనంబు బోయి మహమ్మదీయుల పాలనంబునకు దేశములోనై అందువలన శ్రీ వేంకటేస్వర స్వామి వారి దేవస్థానంబు నదాదిగా మహమ్మదీయుల పాలనాధీనంబాయెను.

మహమ్మదీయ ప్రభుత్వము

క్రీస్తు శకము 1646 మొదలు బిజపూరు సుల్తానులు పాలించిరి. అనంతరం డిల్లీ పాదుషా ఔరంగ జీబు దక్షిణ దేశము దండెత్తి లోబర్చుకొని తంజావూరు, తిరుచునాపల్లి, మైసూరు, వగైరా సామంత రాజ్యముకుపైన ఆర్కాడులో ఒక్క నౌకరు నుంచి పాలింప నాఙాపించి డిల్లీకి విచ్చేసిరి. వీరికే ఆర్కాడు నవాబు అని ఇపేరు. 1732 లో ఆర్కాడు నవాబుగా రాజ్యమునకు వచ్చిన దోస్తు అల్లీ కాలములో కలతలు ప్రారంభమాయెను. వీరి కాలములోనే మహారాష్ట్ర రాజయిన రఘోజీభా౯ నులే కర్నాటక రాజ్యము మీద దండెత్తి దామల్ చెరువు యుద్ధములో 1740లో నవాబులను ఓడించి కొంత దేశమును దోచుకొని పది లక్షల రూప్య