పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

తిరుమల తిరుపతియాత్ర.

గురించిగూడ సౌకర్యార్ధముగా ఏర్పాటులున్నట్టు చెప్పుతారు. తదనుగుణముగా ఆంధ్రసాహిత్య పరిషత్ యొక్క కాళయుక్లి సంవత్సరము మాఘ ఫాల్గుణ మాసముల సంచికలో 428వ పేజీలో ప్రకటింపబడిన చింతరాజుపల్లె పాళెం వెంకటపతిరాయనివద్దనున్న కాగితపు కౌలుకు నకలువల్లను తెలియగలదు.

“స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహనశక వరుశాషంబులు 1448 అగు నేటీ వ్యయనామ సంవత్సర వైశాఖ 18 లు శ్రీమద్రాజాది రాజరాజాకంఠీవర రాజకందర్ప మహా రాజాధిరాజ పరమేశ్వర రాజపూజితులగు మహారాజశ్రీ రామరాజయ్యగారు విజయనగర సింహాసనమున పృధ్విసామ్రాజ్యము చేయుచుండగాను గురుగింజకూటన మలసేని కుమార పెద్ద బుచ్చినాయనవారికి వ్రాయించియిచ్చిన కౌలునీరుపం. మహారాజశ్రీకృష్ణరాయలయ్య గారికిన్ని తరిగొండ తిమ్మానాయనికుమార రామానాయనికిన్ని విరోధం సంభవించినప్పుడు మీరువారిలో కిలస్తిరి అని సంశయించి మీకు నడుస్తువున్న గ్రామాదులు నశీర జప్తిచేయించిరి గనుక కోటకొండ పెద్దవైజుళ రాజు విప్పవెంట కుమార జంగమ రెడ్డి కడప గోపాల బుద్దారెడ్డి వౌగిమళ్ల పెద్దరెడ్డి వీరబల్లె యరమాచిరెడ్డి గెందికోట బాగసాని పెద్దనల్లపరెడ్డి యీ మొదలయిన దేశస్థులున్ను మహారాజశ్రీ రాయలవారీ ముద్రకర్త వుదయగిరి మలహరి శంకరపంతులు కొమారుడు ఆనంద గోపాలపంతులువారు మాతోవిన్నపం చేసిరి. గనుక చిత్తగించి మీకు నడుస్తూవున్న గ్రామాదులు విప్ప వెంటలోకి చెల్లే ఆరు గ్రామాదులున్ను విప్పవెంట ౧ పోంశమాళ్ల ౧ విరువల్లే ౧ సోమవరం పెద్దనీడు ౧