పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

117

ర్చనకుముందు కాలము, రాత్రి దర్శనమై ఏకాంత సేవ ప్రారంభించబోవు కాలము సంధికాలములుగానుండును. ఈసంధి కాలముల యందు ప్రసాదములు శ్రీవారికిఆరగింప గుటవలన ప్రసాదములు చేయువారికి . కష్మతీతము లేకపోవుటయేగాక ప్రసాదములు భోగ్యముగానుండి కాలాకాలములందు భక్తాదులు స్వీకరించుటకు ప్రయుక్తములుగానుండును. ఇట్లుని వేదన చేయుట గలదనుటకు తోమాల సేవకుముందు ప్రసాదములు ఆరగింపయినట్లు శాసనంబువలన ఏర్పడును. శ 1390 సర్వధారిలో కందాడై రామానుజయ్యంగార్ నరీయనూరిసరిహద్దు మొదలు కుండ్రపాకము పరిత్తి పుత్తూరు గ్రామముల మీదుగా దేవమాన్యమగు తీరువేంగడ నెల్లూరులోనిభూములకు నీరుపాగుటకు కాల్వత్రవ్వించి ఆభూమి ఫలితమువల్లను దేవమాన్యమగు కొనిపట్టు దక్షిణపుతట్టు భూముల కునీరుపారునట్లు కాలున త్రవ్వించి ఆభూములఫలసాయము చేతను తోమాల సేవకు(శ్రీవారిపాదాబ్దములుకడిగిన సమయమున) 4గం గాళములదధ్యోదనము శ్రీవారికిఆరగింపు చేయుటకుఏర్పాటు చేసిరి. ఇదిగాక ఇంకొక శాసనమందు శ్రవవణనక్షత్రమందు శ్రీవారలకుతిరుమంజన మైన వెంటనే అన్న ప్రసాదములు ఆరగింపయినట్లు తెలియగలదు శ్రీవారికైయ్యెడిని వేదనలలో ఇడ్డెనలు కూడాపూర్వము ఉండినట్లు శా 1441 ప్రమాదివత్సరపు శాసనమువలన తెలియగలదు.

అచ్చుతరాయలు తర్వాత కొంత కాలమునకు రామరాజు పాలించెను. అప్పుడును వీరుభక్తితో దేవస్థానమును పాలించిరి. తులువవంశస్థుల కాలములోతిరుపతిభాటలు బాగుచేసి యాత్రికులకుసురతముగాపోవునట్లును,యాత్రికులకుప యుక్తముగడోలీలు.