పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

113

కిరీటములు శ్రీకృష్ణ దేవరాయులు శా: 1435 శ్రీముఖవై శాఖ బహుళ ద్వాదశీ సోమవారంనాడు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సమర్పించిరి. శ్రీవారికి ప్రస్తుతం సమర్పణలోనుండు కఠారి శ్రీకృష్ణ దేవరాయులు సమర్పించిరను వదంతి ఈశాసనంబువలన నిజమని ఏర్పడుచున్నది. శా|| 1434 ఆంగీరస ఫాల్గుణ శుద్ధ పంచమినాడు నవరత్న ఖచితమై 3308 తూకాలుగల బంగారు కిరీటము శ్రీస్వామివారికి సమర్పించిరి. ఇదే తేదీలో వీరిభార్యలు.తిరుమల దేవి, చిన్నా దేవి జిలిపాల అవసర. నైవేద్యమునకు పయిండిగిన్నెలు 1కి 374 తూకములుగలవి సమర్పించిరి. దేవస్థానమున కేగాక బ్రాహ్మణులకు విద్వాంసులకు గ్రామాదులు శ్రీకృష్ణ దేవరాయు లొసగిరి. తిరుపతిలో తూపల్ దీకృతులకు శిరిపాది గ్రామంలో మాధవ కాల్వ నొసంగెను. తాళపాకం తిరుమలయ్యకు అనేక గ్రామాదుల నిచ్చిరి. శ్రీ వేంకటేశ్వర స్వామివారి కర్పించిన తిరువాభరణములు మొదలగునవి. లెఖ్ఖ లేదు. ఈ క్రిందని వివరించిన శాసనంబువలన శ్రీవారికి వారు కనకాభిషేకంబు చేసినట్లు తెలియుచున్నది.

"శా 1436 భావ సంవత్సర ఆషాఢ శుద్ధపౌర్ణమిగురువారం శ్రీమద్ మహా రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీవీర ప్రతాప రుద్రగజపతిమీదను దండువిచ్చేసి ప్రతాపరుద్రగజపతిని కొండవీటి దనకాసు విరుగంబొడిచి ఉదయగిరి దుర్గమున్ను కైకొనితిరిగి విజయనగర రాజధానికి విచ్చేస్తున్నూ తిరుమలమీదికి విచ్చేసి తిరువేంగళనాధ దేవునికి కనకాభి షేకంచేసిన రొఖ్కం వరహాలు గ 30000 ఇవే అక్షరాలా ముఫై వేలు”