పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/159

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


114
తిరుమల తిరుపతియాత్ర.

ప్రతాపరుద్ర గజపతిని ఓడించినత ర్వాత గజపతీయొక్క కుమార్తెను వివాహము చేసుకొనినట్టు చెప్పెదరుగానీ ఆరాణి యొక్క ప్రశంస ఇంకను గనపడ లేదు.

వీతర్వాత అచ్యుతరాయులు పాలించిరి వీరికితీరుపతిలో పట్టాభి షేక మహోత్సవ నుయినది. త్రిభువనచక్రవర్తి తిరువేంగడ యాదవరాజు తిరుపతిని సర్వమాన్యముగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సమర్పించినందున అచ్యుతరాయుల కాలమునకే తిరుపతి సర్వమాన్యముగా నుండెను. అచ్యుతరాయులు శ్రీవారికి గ్రామాదులు తిరువాభరణములు మొదలగునవి విశేషముగా అర్పించిరి. హిందూరాజులు శ్రీవారికి ఏర్పాటు చేసిన నివేదనలు ఉత్సవము వర్ణింపనలవికాదు. శా 1446 జయ సంవత్సర మేషమాస బహుళ సప్తమి ఆదివారం ఉత్తరాషాఢనక్షతత్రమందు అచ్యుత రాయులు పట్టమహదేవి వరదాదేవి శ్రీ వారినివేదన ఖర్చులకుగాను గండికోట సీమలోని చిన్నమడుపులూరు, ముత్తుకూరు కొండవీటి సీమలోని పోలివా, వల్లి, మంగ మూరు, నారాయణవుగట్టులో పైండపల్లి, గ్రామములు ఆరింటిని సమర్పించెను.శా 1454 నందనసంవత్సర వృషభ మాస బహుళ ఏకాదశీ సోమవారం ఉత్తరాభాద్రా నక్షత్క్రయుక్తశాసనములో కొండమీద ఆడినుంచి చిత్రివర్కు 7 బ్రహ్మోత్సవములు. తిరుపతిలో వైయ్యాశిలో 1 అనిలో 1 రెండు {బ్రహ్మోత్సవములున్నట్టు ఏర్పడుచున్నది.

ప్రస్తుతం కొండమీద ఒక బ్రహ్మోత్సవము ప్రతీవత్సరము జరుగుచున్నది.అయితే చాాంద్రసూన రీత్యా అధికమాస మువచ్చినప్పుడు మాత్రము రెండవ బ్రహ్మోత్సవము జరుగును.