పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

తిరుమల తిరుపతియాత్ర.


ఈ శాలువవంశీకులు ఈ దేవస్థానమునకు విశేషముగా గ్రామములు, భూములు, తిర్వాభరణములొసగిరి. గుడిగోపురాదులు జీర్ణోద్ధారము చేసిరి. ఇంకను అనేక విధముల వృద్ధి చేసిరి. వీరు క్రిస్తుశకము 1498 లో మృతినొందిరి.

వీరి తర్వాత ఈయన కుమారుడు నీరనరసింహ దేవరాయులు రాజ్యమునకు వచ్చిరి. వీరును దేవస్థానమునకు తిర్వాభరణము మొదలగున వొసగిరి.

తుళువ వంశము.

వీరితర్వాత ఈయనతమ్ముడగు క్రిష్ణదేవరాయలు రాజ్యభారంబువహించి ద్రవిడ దేశమంతయు వశపరచుకొనిరి. వీరి కాలములో విజయనగరరాజ్యం ఔన్నత్యదశనొందెను. వీరి యొక్కయు భార్యలయినచిన్నాదేవి తిరుమలదేవి యొక్కయు విగ్రహములు (statues) పడి కావలిలోపల మంటపములోగలవు.

వీరిని గుఱించి ఈ దేవస్థానములో అనేక శాసనములు గలవు. వీరు ప్రతాపరుద్ర గజపతిని కొండవీడు వరకు తరిమినట్టును ఉదయగిరి ముట్టడించినట్టును శాసనము గలదు. (Vide 9 A 52 of 1889 నీరు శాలివాహనశకము 1486భావ సంవత్సరములో చనిపోయినట్టు అనేక శాసనములు గలవు గానీ మొదటి ప్రాకార వుత్తరగోడమీద శాలివాహన శకము 1436 ఆంగీరస వత్సరములో పరమపద మొందినట్లును, వారి భార్యలు చిన్నా డేవీ, తిరుమల దేవి దేవస్థానమునకు తీర్వాభరణము లొసగినట్లును శాసనములు గలవు.

రవి ఉడిధారకటారీ వరకుచ్చుసహా నచ్చకం ఉడిధార నిచ్చకం కటారివరచిన్న కఠారివరపతకం భుజకీర్తిజతలు 8 చిన్న