పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతి యాత్ర

91

పొలకులచే కాపాడబడుచున్నది.ఇచ్చట ఒక్కసంవత్సరము నివసించి ఆతీర్ధము స్నాన సముల ఉపయోగించుచుండి అంతటా దక్కము క్షిణించును పుణ్యము సమకూరును. ఇదే మాదిరి పాండవులీతీర్ధముదొక సంవత్సరము నివసించి ఒక దుఃస్వప్నము గాంచిరి.అనంతరము యుద్ధములో జయించి రాజ్యమును సంపాదించిరి .ఇందు స్నానము చేసిన కారణమున జనులు దుఃఖ బాహ్యులై సుఖము బడియుదురు.

శ్లో.వృషభాస్థేరవౌ రాడేదేవదాస్యా    
శుక్లే వాప్యశవా కృష్ణ పక్షే భౌనుమన్వితే||

శ్లో.తథేపాండవనా మ్యాత్రణజ్ఞనేన్నతి యోనర|
నేహాదుఃఖ మవాప్నోతి పఠ త్నసుఖమస్నుతే ||

4.జాబాలితీర్ధము

శ్రీ స్వామి పుష్కరిణికి ఉత్తర భాగమునకు ఐదుమైళ్ళ దూరములో జాబాలి తీర్థముగలదు. ఇచ్చట జావలి ఋషి యొక్క ఆశ్రమముండెను.కొంత కాలమైన తర్వాత తిరిగిరాగల నుద్దేశ్యముతో ఒక్కొక్కరే ఆశ్రమమును వదిలివెళ్లిరి. అగస్త్యులు వారిచ్చట ననేక యుగములలో భక్తులు రాజులుతోఁ గలిసి శ్రీవారిని గురించి అద్భుతముగా పూజాదులు జరుపు చుండిరి. ఈతీర్ధములో స్నానము చేసినంతట పంచమాహా పాతకము సహా పోవుటయే గాక పిశాచములు వదలును. ప్రాయశ్చిత్తము లేనీ దోషములు గూడచును.