పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/134

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


90 తిరుమల తిరుపతియాత్ర.

శ్లో.ప్రసార్య వామహస్తాబ్జం శ్రీభూమిభ్యాం నీషేవితం|
   సేవింగీశయా దేన్యవైజయంత్యావిరాజితం||

శ్లో.శ్రీవత్సకౌస్తుభోరస్కం వనమాలావిభూషితం|
   కృపారసతరంగౌఘ పూర్ణ నేత్రాంభుజద్వయం||

శ్లో.శశి ప్రభాసమచ్ఛుత్రం చానురవ్యజనేశుభే|
   హస్తాభ్యాం ధారయంతీ భిర్నారిభిస్సేవితం ముదా||

వరాహపురాణము.

ఈ ప్రకారము చూచుచుండగా చతుర్బాహువులు గల యొక పురుషుడుకట్టెతో కొట్ట వచ్చినట్టు కనపడ వారలందరు భయపడి గుహబయటికి పారివచ్చి యిదంతయు తన మిత్రులకు దెల్సి మహామాయి కామరూపీ మొదలగు వానర సముదాయ మంతయు బయలు దేరి వెళ్లి గుహయందంతయు పరిశీలించి అదేమియు గానక తిరిగి వచ్చిరి. ఈగుహ చొచ్చుట మునులకు యోగులకు కష్ట సాధ్యము. శ్రీమన్నారాయణ లీలావిలాసము చేత ఈవానర శ్రేష్టులకు శ్రీమహావిష్ణువుండు లోకము దర్శనమాయెను. కలియుగములో జనుల నుద్ధరించుటకు గాను శ్రీమన్నారాయణుడు ఈగుహలో ఈమాదిరిగా నుండును. ఈ ప్రభావము వినినంత మాత్రముననే కలికాలములో జనులకు దోషములు పోయి సమస్త సుఖంబులు బడయుదురు, ఈగుహలో నుండి వచ్చెడి తీర్థము సాక్షాత్ వైకుంఠములో నుండి వచ్చుచున్నందున నిండలి స్నాన ఫలము చెప్పనలవిగాదు.

3.పాండవ తీర్థము.

శ్రీ స్వామివారి దేవస్థానమునకు వాయవ్య మూలలో నుమారుమైలు దూరమున నొకతీర్థము గలదు. అది శ్రీక్షేత్ర