పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

తిరుమల తిరుపతియాత్ర.

కావేరీ నదీతీరమున దురాచోరుడను నొక బాహడుండెను. ఎల్లప్పుడు కౄరకర్మయేగాని సుకృత్యము లెన్నడు చేసిన వాడు కాడు. పంచమహా పాతకములు సదా చేయువాడు.ఈ దుష్కర్మవల్ల నొక బ్రహ్మ రక్షసి అతనికి పట్టియనే దేశములు త్రిప్పెను. పూర్వపుణ్యఫలము వలన నీదూరాచారుడు పిశాచ వీడితుడయ్యు నీవేంకటాద్రికివచ్చి యీతీర్థములో స్నానము చేసేను.వెంటనె తన దుష్కర , మంతయు పోయి పిశాచము తోలగుటయే గాక దానికిన్ని విముక్తిగలిగేను. పిశాచము తొలగినందు వలన తెలివిగలిగి చెంతనున్న జాబాలి ఋషి వద్దకు బోయి "నేను కావేరి తీరముననుండి దుష్కరముచేయుచు దురాచారుడను నామమున బిలువబడు చుంటిని, నేనిప్పుడు ఎక్కడనుంటినో నెటులనిక్కడకు వచ్చితీనో డెలుపవేడెదనన" నాముని ముహుర్తమాత్ర మాలోచించీ కనికరము గలిగి “పూర్వ మొకానొక బ్రాహణుండు పితృశ్రాద్ద్ధము పార్వణ విధానముగ చేయనందున పితృశాపము వలన పిశాచరూపము బొందెను. ఆపిశాచముసదా దుష్కరుడవగు నిన్ను దేశమంతయు త్రిప్పి తుదకు నీపుణ్యమువలన నిక్కడకు తీసుకోని రాగా ఈతీర్థ స్నానముచే నాపిశాచమునకుముక్తి గలిగె ను. నీకు దుష్కర తోలిగెను.”

శ్లో. యాని నిష్కృతి హీనాని పాపాన్యపీ వినాశయేత్ |
శూద్రేణ పూజితం లిజ్ఞం విష్ణుంవాయెనమోద్విజః||

శ్లో. ప్రాయశ్చిత్తంగత స్యోక్తం స్మృతిభిః పరమర్షిభిః
నశ్యేత్త స్యాపితత్పాపం తీర్ధే జాబాలిసంజ్ఞకే||