పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/560

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0296-05 మాళవి సం: 03-558 విష్ణు కీర్తనం

పల్లవి:

తెలుపఁగ రాదిది దేవుని మాయలు
ఫల మెఱఁగరు యీ పట్టినవెఱ్ఱి

చ. 1:

పుట్టిరి దివిజులు పురుషోత్తమునం-
దట్టే యణఁగిరి యతనందు
యిట్టే యీతని యిందరితో సరి-
వెట్టి కొలుచుటే పెనువెఱ్ఱి

చ. 2:

వుపమించి తెలిసితే నొక్కటే జగము
అపురూపపు నీసృష్టి అతిఘనము
అపరిమితపు జీవు లణువత్రులైనాను
యెపుడు శ్రీవేంకటేశ యెక్కుడు నీదాసులు