పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0245-05 పాడి సం: 03-258 కృష్ణ

పల్లవి:

శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును
సృష్టించె నొక్కవేళనే శ్రీజయంతినాఁడు

చ. 1:

హరి కృష్ణావతారమందినయంతలోనే
పరమ మునులకెల్ల భయముడిగెను
తెరలి దైత్యులగుండె దిగులుచొచ్చె నత్తరి
సిరుల మించినయట్టి శ్రీజయంతినాఁడు

చ. 2:

గోవిందుఁడు వసుదేవుకొడుకైన యప్పుడే
గోవులు రంకెలువేసె గొల్లపల్లెను
నోవితోడఁ గంసునికి నూరునిండెఁ జూడఁగానె
చేవలు మీరినయట్టి శ్రీజయంతినాఁడు

చ. 3:

నారాయణుఁడు భువి నరుఁడు దాఁ గాఁగానే
మేరఁ బాండవు లెచ్చిరి మేనవావిని
కౌరవులపని దీరె కమ్మి శ్రీవేంకటేశుఁడు
చేరువనే మెరయఁగ శ్రీజయంతినాఁడు