పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0245-04 బౌళి సం: 03-257 అధ్యాత్మ

పల్లవి:

కమ్మరను జీవునికిని ఇది కారణ మేమియు లేదట
ఇమ్ముల రాజూ నెరఁగని వెట్టెట యెవ్వరికెక్కును నారాయణా

చ. 1;

యిలలో జీవునివిషయభోగమున నెందునుఁ బొరయనివాఁడవట
చలమా యేల పుట్టించితివీ సంసారవారిధిని
కలకాలము నీగర్భగోళమునఁ గాఁపురముండఁగ నిటు చేసి
ఫలమేమి గట్టుకొంటివి భావము దెలుపవే నారాయణా

చ. 2:

నడపెడి యా జగములన్నియును నటనలునీవట తొలుతనే
యెడయక యిందే వినోదించెదవు యెడ్డతనంబా నీకేమి
జడియక నీవే సేసిన చేఁతలు సర్వమును నిలుపఁగవలదా
కడుగఁగనేఁటికి నెంగిలిబూరెట కడవేయవేల (?) నారాయణా

చ. 3:

పరగిన యీ కర్మమార్గములు బంధహేతువని చెప్పితివి
యిరవుగను వేదమార్గములు నేలా కాచుక తిరిగెదవు
గరిమల శ్రీవేంకటేశ్వర యిచ్చాకల్పితములు యిన్నియు నీకు
హరినెరిగించితివిఁక నీచిత్తము సర్వేశ్వర వో నారాయణా