ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 05-6 నాదరామక్రియ సం: 10-029
పల్లవి:
వేవేలుచేఁతలవాఁడు వీఁడె వీఁడె
దేవుఁడుగదె ప్రసన్న తిరువెంగళప్పఁడు
చ. 1:
యిద్దరు సతులు తన యిరువంకలఁ గొలువ
గద్దెన చూపులనె కరఁగింపుచు
అద్దరిపాటు సేసి ఆయములు ముట్టీని
తిద్దిన గోళ్ల ప్రసన్న తిరువెంగళప్పఁడు
చ. 2:
కామినులు నలువంక కదిసి సేవలు సేయ
సామపు మాటలనె యాసలు సేయుచు
దోమటి చెనకులనె దుండగాలు సేసీని
దీమముతో ప్రసన్న తిరువెంగళప్పఁడు
చ. 3:
అలమేలుమంగ దన కాకుమడి చియ్యఁగాను
సొలపుల మాఁటలనె చొక్కింపుచు
నలువై శ్రీవెంకటనాథుడై కూడినవాఁడు
తెలిఁగన్నుల ప్రసన్న తిరువెంగళప్పఁడు