ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 05-5 శంకరాభరణం సం: 10-028
పల్లవి:
చెల్లె నీవు సేసినట్టి చేఁత లెల్లాను
కొల్లలై కోవిలకుంట్ల గోపాలకృష్ణుఁడా
చ. 1:
అసము దించక మాఁటలాడేవు గాక నాకు
వసమయ్యేవా యింతవన్నె కాఁడవు
కసిగాటువలపుల గబ్బివైన నిన్ను నేల
కొసరేఁ గోవిలకుంట్ల గోపాలకృష్ణుఁడా
చ. 2:
సడికి వెరచి నాతో సరసమాడేవు గాక
తొడరేవా నీ వింత దొడ్డవాఁడవు
విడువని పొందులతో విఱ్ఱవీఁగేనీకు నేల
కొడిమె కోవిలకుంట్ల గోపాలకృష్ణుఁడా
చ. 3:
బాసకు వెరచి నన్నుఁ బై కొని కూడితి గాక
ఆసగద్దా నీకు నింత అందగాఁడవు
వేసారవు రతుల శ్రీవెంకటనాథ వొకరి
కోసమా కోవిలకుంట్ల గోపాలకృష్ణుఁడా