Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 05-4 సాళంగనాట సం: 10-027

పల్లవి:

రచ్చ కెక్కితివి పండరంగివిఠలా
పచ్చిదేరే వింతలోనె పండరంగివిఠలా

చ. 1:

గుట్టుగల దొర వని కొసరి చూచినంతనె
రట్టుగా నవ్వేవు పండరంగివిఠలా
మట్టుమీరి తమకపు మాఁటలనె నీవలపు
బట్టబయలె సేసేవు పండరంగివిఠలా

చ. 2:

సాగినసబలలోన సన్న సేసినంతలోనె
రాగిదేలించేవు పండరంగివిఠలా
వేగిరపుఁ జేఁతలనె విరివి నీమోహ మెల్ల
బాగుగా వెళ్ల వేసేవు పండరంగివిఠలా

చ. 3:

తతి నీ వున్న చోటికి దగ్గర వచ్చినంతనె
రతిఁ గూడితివి పండరంగివిఠలా
గతి యైన శ్రీవెంకటనాథ యేలితివి
పతివై కోవిలకుంట్ల పండరంగివిఠలా