Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 05-3 రామక్రియ సం: 10-026

పల్లవి:

మేలు మేలె నిన్ను నీవె మెచ్చుకొనవే
కోలుముందైన పనులకు కొంకఁ దగునా

చ. 1:

పచ్చిగా గుబ్బలమీఁది పయ్యద జారినందుకు
యెచ్చరించితేఁ గోపించే వేమాయనే
కచ్చు పెట్టి యింత వాసి గలదానవు నీవు
మెచ్చి మెచ్చి నన్నుఁ జూచి మెయి మరవఁదగునా

చ. 2:

అక్కరైన మోహముతో నరగన్ను మొగిచినందు
కిక్కు వంటితేఁ గోపించే వేమాయనే
చిక్కక మనసులోన సిబ్బితి గలదానవు
గక్కన నాయెదుటను కరఁగఁగ దగునా

చ. 3:

పొంతనె నామోహముతో చూచి పులకించినందుకు
యెంత నేఁ జేసినా నందు కేమాయనే
కంతుని కేలిని శ్రీవెంకటనాథుఁడఁ గూడఁగా
వంతుకు నీ కింత పరవశము గాఁ దగునా.