ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 05-1 మాళవిగౌళ సం: 10-024
పల్లవి:
తియ్యనిమాఁటలఁ దేలించేవూ
వొయ్యారపు వూటుకూరి చెన్నరాయ
చ. 1:
పిలిచే వూరకె పిన్ననాఁటి పొందు
గలవానివలెనె యాఁకటతోడ
చలిమినె నన్నింత సందడి సరసాల
వులికించకు వూటుకూరి చెన్నరాయ
చ. 2:
చెనకే వూరకె చేవమీరి కడు
చనవరివలెనె ముచ్చటతోడ
పెనఁగుచు నీ విట్టె ప్రియములు నెరసేవు
వునుపుఁజేతఁల వూటుకూరి చెన్నరాయ
చ. 3:
తివిరే వూరకె దిట్టతనమునను
కవగూడే ననుచు నక్కరతోడ
నవకపు శ్రీవెంకటనాథ నన్నుఁ గూడి
తువిదలలో నూటుకూరి చెన్నరాయ.