Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 04-6 రామక్రియ సం: 10-023

పల్లవి:

వద్దు నాతో వెచ్చీ వేవని మాయలు
వుద్దండపు వో సంబటూరి చెన్నరాయఁడా

చ. 1:

అమ్మమీఁద నానవెట్టి ఆసవుట్టె మాఁటలాడి
నమ్మించ వచ్చేవు నాకుఁ గొత్తలా
సమ్మతి నీ వలపుల సతులవద్దికె పోయి
యెమ్మెలు నెరుపేవారి నెలయించవయ్యా

చ. 2:

మానము సోఁకనాడి మచ్చిక బాస లిచ్చేవు
యీనెపాలెల్లా నే నెఱఁగనివా
వూనినవేడుకల నీ వువిదలతోడుతను
నీ నేరుపు సట లెల్లా నెరపవయ్యా

చ. 3:

కాఁగిటికిఁ జేరఁ దీసి కన్నుల మొక్కులు మొక్కి
ఆఁగేవు నేఁ దెలియనిపనులా
నాఁగువార శ్రీవెంకటనాథ నన్నుఁ గూడితివి
యేగి వచ్చి యిట్టె మాయింట నుండవయ్యా