ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 04-5 సాళంగనాట సం: 10-022
పల్లవి:
దొరపు నిన్నౌఁగా దని దూరవచ్చునా
అరిదిపడేము గాక యాదవనారాయణా
చ. 1:
నిమ్మపంట వేయగాను నిక్కము వచ్చే వని
నమ్మితిఁగా యాదవనారాయణా
చిమ్ముల నాచూపులకు చిక్కినట్టె వుండితివి
అమ్మరో యింత సేతురా యాదవనారాయణా
చ. 2:
పువ్వులు నీ వంపఁగాను పులకించి సంతోసాన
నవ్వితిఁగా యాదవనారాయణా
దవ్వులనుండె నాకు దక్కినట్టె వుండితివి
యౌవ్వనపుమదమున యాదవనారాయణా
చ. 3:
యింటికి నీవె రాఁగా యిప్పు డిట్టె భ్రమసితి
నంటుఁజూపుల యాదవనారాయణా
వెంట వెంటఁ దిరిగి శ్రీవెంకటనాథుఁడవై
అంటుకొని కూడితివి యాదవనారాయణా.