Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 03-1 ముఖారి సం: 10-012

పల్లవి:

ఇన్నియు నేమి సేయునె యింపు లిన్నియునుఁగూడి
కన్నెపాయాననె నన్నుఁ గలికి జేయఁగను

చ. 1:

మన సేమి సేయునె మచ్చిక యీవలపులు
కొనసాగి లోలోనె గుబ్బతిలఁగా
తను వేమి సేయునె తతిగొన్న తమకము
వెనుకొని పోనీక వీరిడిఁ జేయఁగను

చ. 2:

చూపు లేమి సేయునే సుడిగొన్న జవ్వనము
పై పైఁ దీపు లెక్కించి భ్రమయించఁగా
కోప మేమి సేయునె గురియై యీ విరహము
ఆపసోపాలె రేఁచి అలయించఁగాను

చ. 3:

పులక లేమి సేయునె పోదియై పతికాఁగిలి
కళలలోని మర్మాలు గలఁచఁగాను
చెలువ మేమి సేయునె శ్రీవెంకటనాథుఁడు
సొలపులరతిఁ గూడి చొక్కించఁగాను