ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 02-6 ఆహిరి సం: 10-011
పల్లవి:
ఇంతలోసందుకొనే వేమీ నీవు
యెంతసేతువో నీతో నీతో నిట్టె పొందుసేసిన
చ. 1:
తేలగిలఁ జూచితేనె తెలిసె నీమన సంటా
తాలిమితోడుత నన్ను దగ్గరేవు
పోలికగా నామేను పులకించినంతలోనె
ఆలిఁ జూచినట్టె చూచే వవునయ్య నీవు
చ. 2:
అలవోకగా నీపే రడిగినయంతలోనె
చెలరేఁగి నీవావి చెప్పేవూ
జలకపుఁ జెమటలు సారె నామైఁ బొడమితె
వలపుచల్లి చొక్కించవచ్చేవు నీవూ
చ. 3:
సవరనివాఁడ వంటా జాణతన మాడితేనె
రవళిఁ జెయిముట్టి సరస మాడేవు
నవకపు శ్రీవెంకటనాథ కాఁగిలించితేనె
కవకవనవ్వి రతిఁ గలసితి నీవూ.