ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 02-5 పాడి సం: 10-010
పల్లవి:
ఎంత సేసినాను ని న్నేమనేనురా
వింతదాననా యలిగి వెరపుచూపను
చ. 1:
యేడనై నా నిలిచి నీ వెవ్వతెతో నైన మాఁట
లాడుకొన్న నిన్ను నే నద్దలింతునా
యీడనుండె నన్ను నీ వెవ్వతెపేరఁ బిలిచినాను
కోడెకాఁడ నిన్ను నిట్టె కోపగింతునా
చ. 2:
కలికివైన నిన్ను నేకాంతయింటఁ జూచినాను
చలము సాధించి నిన్ను సాధింతునా
సొలసి నీమేన నెవ్వతె సొమ్మువెట్టు కుండినాను
కులుకుమాఁటలను నిన్ను గుంపింతునా
చ. 3:
వన్నెకాఁడ యేరమణి వాకిలిగాచున్నా నిన్ను
సన్న సేసి సారె సారె జంకింతునా
నన్ను నిట్టె శ్రీవెంకటనాథుఁడ నీవెకూడి నేఁడు
కన్నెనైన నామనంబు కఁరఁగ జేసితి