ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 01-4 పాడి సం: 10-4
పల్లవి:
మానరా నారో నింక మరఁగులు
పోనీనెంతైనా నిన్ను బొంకకు నాతోను
చ. 1:
గుఱుతైన యాకెమేనికుంకుమపరిమళము
మెఱయ నేఁటికిరా నీమేనియందును
మెఱుఁగు నీమేనిమీఁద మించిని కెంపేలవచ్చె
పొఱపొచ్చముల నీవు బొంకకు నాతోను
చ. 2:
లలనపాదాననున్న లత్తుక నీనొసలను
కలుగ నేమిటికి వేగనచెప్పరా
కలికిపుక్కిటనున్న కప్పురపుఁ దమ్ములము
పొలుపై నీకేలవచ్చె బొంకకు నాతోను
చ. 3:
పడఁతి నీమేన నిట్టె బాగుగానించినయట్టి
జడిగొన్న కొనగోళ్లజాడ లేడవి
కడఁగి నన్ను శ్రీవెంకటనాథ కూడితివి
పొడవైనచెలిసుద్ది బొంకకు నాతోను